iDreamPost
android-app
ios-app

తండ్రితో సహా వరదలో కొట్టుకుపోయిన యువ సైంటిస్ట్‌ అశ్విని! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

  • Published Sep 01, 2024 | 8:01 PM Updated Updated Sep 02, 2024 | 3:03 PM

Mahabubabad District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నీటి ఉధృతిపెరిగిపోవడంతో మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఊహించని దారుణం చోటు చేసుకుంది.

Mahabubabad District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నీటి ఉధృతిపెరిగిపోవడంతో మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఊహించని దారుణం చోటు చేసుకుంది.

  • Published Sep 01, 2024 | 8:01 PMUpdated Sep 02, 2024 | 3:03 PM
తండ్రితో సహా వరదలో కొట్టుకుపోయిన యువ సైంటిస్ట్‌ అశ్విని! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్లౌడ్‌ బరస్ట్‌ అయిన విధంగా కుండపోత వర్షం దంచికొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వాగులు, నదులు, చెరువులు పొంగిపోవడం రహదారులన్ని  జలమాయమైయ్యాయి. అలాగే పలుచోట్ల వరద ఉధృతి పెరిగిపోవడంతో..  లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరిపోయి ప్రజలంతా అతలాకుతలం అయ్యారు. అదే విధంగా  పలు ప్రాంతల్లో వరద నీరు ప్రభావంతో చాలామంది  ప్రాణాలు సైతం  కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని వరద ఉధృతి కారణంగా ఓ తండ్రి, కూతురు కారుతో కారుతో సహా  వాగులోకి కొట్టుకుపోయి మృతి చెందారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో వందలాది గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే.. నేడు  మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి దగ్గర  వరద ఉధృతి చాలా ప్రమాదకరంగా మారింది. అయితే ఆ మార్గం గుండా నేడు కారులో ప్రయాణం చేస్తున్న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన మునావత్ మోతీలాల్ ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డా. అశ్విని హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. కానీ, అప్పటికే ఆ ప‍్రాంతంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో..   ఆ తండ్రి కూతురు కారుతో సహా వరద ప్రవాహంకు వాగులోకి కొట్టుకుపోయారు.

 అయితే ఆకేరు వాగు సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో అశ్విని మృత దేహం లభ్యమైంది. దీంతో పాటు కారు ఆనవాళ్లు కూడా ఏటి ప్రవాహంలో కనిపిస్తున్నాయి.  కానీ, తండ్రి మోతిలాల్ ఆచూకి మాత్రం ప్రస్తుతానికి లభ్యంకాలేదు అయితే ఈ ఘటన జరగకముందు  తాము ప్రమాదంలో ఉన్నట్లు చివరి సారిగా కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడారని పోలీసులు సమాచారం తెలిపారు.  అయితే ముఖ్యమైన పని కోసం ఇలా నగరానికి బయలుదేరుతుండగా తండ్రి కూతురు మరణించడం పై ఆ కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. అంతేకాకుండా.. మంచి బంగారు భవిష్యత్తు కలిగిన ఒక యువ సైంటిస్ట్‌ అశ్విని ఇలా వరద రూపంలో మృత్యువు కాటేయడం పై స్థానికంగా అందర్నీ కంటతడి పెట్టించింది.