iDreamPost
android-app
ios-app

ఈ ఆలయానికి వెళ్తే.. అప్పుల నుండి విముక్తి ఖాయం! అందరూ చెప్తున్న మాట!

  • Published Mar 25, 2024 | 4:14 PM Updated Updated Mar 25, 2024 | 4:14 PM

జీవితంలో అప్పుల బారిన పడకుండా ఎవరు ఉండరు. అప్పు చేసిన తర్వాత వాటిని తీర్చడం మరింత కష్టంగా మారుతుంది. ఇలా అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే, అలాంటి సమస్యలు ఉన్న వారు ఇప్పుడు చెప్పుకోబోయే గుడికి వెళ్ళొస్తే చాలట.

జీవితంలో అప్పుల బారిన పడకుండా ఎవరు ఉండరు. అప్పు చేసిన తర్వాత వాటిని తీర్చడం మరింత కష్టంగా మారుతుంది. ఇలా అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే, అలాంటి సమస్యలు ఉన్న వారు ఇప్పుడు చెప్పుకోబోయే గుడికి వెళ్ళొస్తే చాలట.

  • Published Mar 25, 2024 | 4:14 PMUpdated Mar 25, 2024 | 4:14 PM
ఈ ఆలయానికి వెళ్తే.. అప్పుల నుండి విముక్తి ఖాయం! అందరూ చెప్తున్న మాట!

చాలి చాలని జీతాలు, అద్దె ఇళ్ళు, ఆస్తులకు మించిన ఆశలు, మోయలేని ఫీజుల భారం, నెలాఖరు వచ్చిందంటే రోజు ఎలా గడుస్తుందా అనే సతమయ్యే ఆలోచనలు.. ఇవన్నీ ఎన్నో మధ్య తరగతి కుటుంబాలను కలచి వేసే సమస్యలు. వారికీ వచ్చే జీతం సరిపోక.. అవసరాలను కాదనలేక .. ఏమి చేయలేని పరిస్థితిలో వారికీ ఉండే ఒకే ఒక్క దారి అప్పు చేయడం. ఇక ఒక్కసారి అప్పు చేసిన తర్వాత.. మళ్ళీ ఆ అప్పులను తీర్చడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు. వారు చేసిన అప్పులు తీర్చలేక .. మనో ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి కొంత మంది దేవుడిపై భారం వేసి బ్రతుకు బండిని సాగిస్తూ ఉంటారు. అయితే, అప్పులు చేసిన వారు తమ అప్పులను త్వరగా తీర్చుకోవాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయానికి వెళ్తే చాలు.

చాలా మంది తమ అప్పుల భాధలు తీరితే వెంకన్నను దర్శించుకుంటాం అని మొక్కులు మొక్కుతూ ఉంటారు. అలాంటి దేవాలయాలలో ఒకటే.. చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో ఉంటుంది. దీనిని తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. పైగా, సాక్షాత్తు కలియుగ దైవం ఆ వెంకన్న స్వామియే స్వయంగా తిరుపతి నుంచి.. నడుచుకుంటూ వచ్చి .. చిల్పూర్ గుట్టపై వెలశారని అక్కడి భక్తుల నమ్మకం. అయితే, అసలు ఆ స్వామి వారి చరిత్ర ఏంటో తెలుసుకుందాం. పూర్వం.. ఆ శ్రీమన్నారాయణ స్వామి వారు .. శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి.. పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు చేశారట. అయితే, ఈ సందర్భంలో వెంకన్న ఆ అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనితో అప్పు తీర్చాల్సిన సమయం దగ్గర పడే కొద్దీ.. స్వామి వారికీ మదిలో భయం మొదలైందట.

ఈ క్రమంలో ఆ ఆలోచనలతో నిద్రిస్తున్న స్వామికి.. స్వప్నంలో ఈ చిల్పూర్ ప్రదేశం అంతా కనిపిస్తుందట. దీనితో నిద్రలోనుంచి మేల్కొన్న స్వామి వారు నడుచుకుంటూ .. ఈ చిల్పూర్ గుట్ట వద్దకు వస్తారట. ఆ గుట్ట కింద భాగంలో ఆయన తన పాదరక్షలు విడిచిపెట్టి.. కొండపై ఉన్న గుహలోకి వెళ్లి తపస్సు చేస్తారట.. ఇక ఆ సమయంలో ప్రత్యేక్షమైన కుబేరునికి స్యామి వారు క్షమాపణ కోరుతారు. ఈ ప్రదేశానికి వచ్చినందుకు .. నా సమస్యకు పరిష్కారం దొరికిందని స్వామి వారు సంతోషిస్తారు. కాబట్టి, ఈ కారణంగా స్వామి వారు ఆ ఆలయానికి వెళ్లే భక్తులకు .. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కార మార్గాలు చూపిస్తారని భక్తుల నమ్మకం. కాబట్టి ఆర్థిక బాధలతో సతమతమౌతున్న వారు.. ఈ ఆలయానికి వెళితే మంచిదని చెబుతున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.