Dharani
అనధికారికంగా కరెంట్ కోతలకు పాల్పడే అధికారుల తాట తీస్తామని సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చినా కొందరు సిబ్బంది మారలేదు. దాంతో వారిని సస్పెండ్ చేశారు. ఆ వివరాలు..
అనధికారికంగా కరెంట్ కోతలకు పాల్పడే అధికారుల తాట తీస్తామని సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చినా కొందరు సిబ్బంది మారలేదు. దాంతో వారిని సస్పెండ్ చేశారు. ఆ వివరాలు..
Dharani
విద్యుత్ కోతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కావాలని కరెంట్ కట్ చేసే ఉద్యోగుల తాట తీస్తానంటూ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా సరే కొందరు ఉద్యోగులు.. ముఖ్యమంత్రి వార్నింగ్‌ను సైతం లెక్క చేయకుండా.. అనధికారికంగా కరెంట్ కోతలు విధించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సదరు ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చారు. వారిని విధులు నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఆ వివరాలు..
ముందస్తు అనుమతి లేకుండా అనధికారికంగా కరెంట్ సరఫరా నిలిపివేసిన ముగ్గురు విద్యుత్ శాఖ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హైదరాబాద్, కొండాపూర్ డివిజన్‌లోని అల్లాపూర్ సెక్షన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ఉపకేంద్రంలో లైన్‌మెన్‌గా పని చేస్తున్న నర్సింహ, జూనియర్ లైన్‌మెన్‌లు విజయ్, దస్రులు.. అనధికారికంగా కరెంట్ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు.
సదరు సిబ్బంది శుక్రవారం నాడు సర్వే ఆఫ్ ఇండియా కాలనీలో అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతేకాక ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే.. నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి సంబంధించిన విద్యుత్ తీగల మార్పిడి పనులు చేపట్టారు. దీనిపై సీఎండీకి ఫిర్యాదు అందింది. అప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెంట్ కోతల గురించి అధికారులకు వార్నింగ్ ఇవ్వడంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు వెంటనే విచారణ చేపట్టి.. కరెంట్ నిలిపివేసిన ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో వారిని సస్పెండ్ చేసినట్లు కొండాపూర్ డీఈ వెల్లడించారు.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గురువారం నాడు విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలిగితే.. అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు.. కొందరు సిబ్బంది, అధికారులు కావాలనే పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపివేసినట్లు తన దృష్టికి వచ్చిందని.. అలాంటి వారు మారకపోతే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. అంతేకాక గతంతో పోల్చితే.. ఈ ఏడాది విద్యుత్ సరఫరా పెంచినప్పటికి కావాలనే కొందరు కరెంట్ కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ వార్నింగ్‌ను సైతం పట్టించుకోకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసిన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు.