iDreamPost
android-app
ios-app

రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.. IMD ఎల్లో అలర్ట్ జారీ

  • Published Jul 12, 2024 | 1:08 PM Updated Updated Jul 12, 2024 | 1:08 PM

తెలంగాణ రాష్ట్రంలో నిన్న గురువారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నయని తాజాగా ఐఎండీ పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలార్ట్ కూడా జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో నిన్న గురువారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నయని తాజాగా ఐఎండీ పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలార్ట్ కూడా జారీ చేసింది.

  • Published Jul 12, 2024 | 1:08 PMUpdated Jul 12, 2024 | 1:08 PM
రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.. IMD ఎల్లో అలర్ట్ జారీ

ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు సంభవించడంతో నగరంలోని గత కొన్ని రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉదయం వేళాలో విపరీతమైన ఎండ పెట్టి, మధ్యహ్న సమయంలో మబ్బులు, గాలులు వీస్తూ.. వర్షాలు కురుస్తున్నాయి. ఇలా తరుచు తేలికపాటి జల్లులు కురవడంతో రాష్ట్రంలో వాతవరణం చల్లగా మారిపోతుంది. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ లోనే నిన్న గురువారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అంతా జలమయంగా మారడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ముఖ్యంగా ఈ భారీ వర్షం కారణంగా.. జూబ్లీహిల్, బంజారాహిల్స్ నుంచి రసూల్‌పుర, అమీర్‌పేట వరకూ భారీగా ట్రాఫిక్​ జాం అయింది. అయితే నగరంలో రానున్న మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, భారీగా వర్షాలు కురస్తాయని తాజాగా ఐఎండీ పేర్కొంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పైగా నేడు శుక్రవారం ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే  అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా.. గంటకు 11 నుంచి 12కిలోమీటర్ల వేగంతో కూడిన గాలి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Rains in Hyderabad

అలాగే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి,మెదక్, కామారెడ్డిలో జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. దాంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా.. రానున్న మూడు రోజులు నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో..  రాష్ట్రా వ్యాప్తంగా  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ వెల్లడించింది. మరి, రానున్న మూడు రోజులు నగరంలో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ తెలిపిన సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.