P Krishna
Medak Police Saved The Man: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కాల్వలు, చెరువుల, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల పరిస్థితి దారుణంగా మారింది. జలదిగ్బంధంలో ఉన్నాయి.
Medak Police Saved The Man: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కాల్వలు, చెరువుల, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల పరిస్థితి దారుణంగా మారింది. జలదిగ్బంధంలో ఉన్నాయి.
P Krishna
తెలంగాణను వరుణ దేవుడు వదిలిపెట్టడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పూర్తిగా రవావాణా వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ క్రమంలోనే వాతవారణ శాఖ మరో రెండు రోజులు 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా కాల్వులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఓ వాగులో చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిని ఓ పోలీస్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండు వాగులో రమావత్ అనే వ్యక్తి అనుకోకుండా పొంగిపొర్లుతున్న వాగులో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో ఓ బండరాయిని పట్టుకొని ఆగిపోయాడు. తనని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయడం చూసిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెదక్ పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని తాళ్ల సాయంతో కాపాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Medak police rescued Ramavath Nandu (45), who was swept away by the strong current in Gundu stream, Tekmal mandal, while fishing.@NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @santwana99 #TelanganaRains pic.twitter.com/xKiD8tDt5y
— Sri Loganathan Velmurugan • TNIE (@sriloganathan6) September 3, 2024