iDreamPost
android-app
ios-app

వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు!

  • Published Sep 04, 2024 | 12:30 AM Updated Updated Sep 04, 2024 | 12:30 AM

Medak Police Saved The Man: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కాల్వలు, చెరువుల, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల పరిస్థితి దారుణంగా మారింది. జలదిగ్బంధంలో ఉన్నాయి.

Medak Police Saved The Man: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కాల్వలు, చెరువుల, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల పరిస్థితి దారుణంగా మారింది. జలదిగ్బంధంలో ఉన్నాయి.

  • Published Sep 04, 2024 | 12:30 AMUpdated Sep 04, 2024 | 12:30 AM
వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు!

తెలంగాణను వరుణ దేవుడు వదిలిపెట్టడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పూర్తిగా రవావాణా వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ క్రమంలోనే వాతవారణ శాఖ మరో రెండు రోజులు 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా కాల్వులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఓ వాగులో చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిని ఓ పోలీస్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. వివరాల్లోకి వెళితే..

మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండు వాగులో రమావత్ అనే వ్యక్తి అనుకోకుండా పొంగిపొర్లుతున్న వాగులో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో ఓ బండరాయిని పట్టుకొని ఆగిపోయాడు. తనని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయడం చూసిన గ్రామస్థులు వెంటనే  పోలీసులకు సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.  మెదక్ పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని తాళ్ల సాయంతో కాపాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.