iDreamPost
android-app
ios-app

భారీ ధర పలికిన తొలి TG నంబర్‌! ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ఇక టీజీ పేరుతో జరుగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో స్పెషల్ నంబర్ల కోసం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అధికారులు ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. తొలి రోజు అనూహ్య స్పందన వచ్చింది.

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ఇక టీజీ పేరుతో జరుగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో స్పెషల్ నంబర్ల కోసం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అధికారులు ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. తొలి రోజు అనూహ్య స్పందన వచ్చింది.

భారీ ధర పలికిన తొలి TG నంబర్‌! ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు

వాహనాలను కొనడం ఎంత క్రేజీగా ఫీల్ అవుతుంటారో.. దానికి సంబంధించిన నంబర్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటారు వాహన యజమానులు. తమ లక్కీ, స్పెషల్ నంబర్ల కోసం కొంత మంది వాహనాల ధర కన్నా.. నెంబర్‌కే డబ్బులు ఎక్కువ వెచ్చించిన దాఖలాలున్నాయి. అలాగే ఫ్యాన్సీ నంబర్ల కోసం కూడా అత్యధిక మొత్తంలో ఖర్చుపెట్టేవారున్నారు. ఇలా కార్ల నంబర్ విషయంలో మనకు ఎక్కువగా తారక్ లాంటి స్టార్స్ తారసపడుతుంటారు. ఇలాంటి నెంబర్ల కోసం సామాన్యులు కూడా అత్యుత్సాహం చూపిస్తుంటారు. అదే రుజువైంది.. తెలంగాణలో. ఇటీవల తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ అని ఉండగా.. తాజాగా ‘టీఎస్’ అని మార్చిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో శుక్రవారం హైదాబాద్ నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక నెంబర్లకు తొలి రోజు ఆర్టీఏ అధికారులు ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వహించగా.. అనూహ్య స్పందన వచ్చింది. ఓ వాహనదారుడైతే.. ఏకంగా ఓ నంబర్ కోసం రూ. 9.61 లక్షలు పెట్టి సొంతం చేసుకోవడం ఆశ్చర్యాన్ని గెలుపుతోంది. ఈ ధరతో ఆయన ఇంకొక కారు కూడా కొనుకోవచ్చు. ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో టీజీ 09 0001 నెంబర్ కోసం రుద్ర రాజు రాజీవ్ కుమార్ అనే వాహన యజమాని ఇంత మొత్తంలో వెచ్చించారు. ఇది తొలి టీజీ నంబర్ అని తెలుస్తోంది. ఇక టీజీ 09 0909 నెంబర్ కోసం భవ్య సింధు ఇన్ ఫ్రా సంస్థ రూ. 2.30 లక్షలు చెల్లించి దక్కించుకుంది. శాన్వితా రెడ్డి అనే వాహన యజమాని టీజీ 09 0005 నెంబర్ కోసం రూ. 2.21 లక్షలు ఖర్చు పెట్టారు.

 దుశ్యంత్ రెడ్డి అనే వాహనదారుడు టీజీ 09 0002 సంఖ్య కోసం రూ. 1.22 ల క్షలు చెల్లించారు. టీజీ 09 0369 నంబరింగ్ కోసం రూ. 1.20 లక్షలు, టీజీ 09 0007కు రూ. 1.07 లక్షలు చొప్పున వెచ్చించారు. మొత్తంగా ఈ స్పెషల్ నెంబర్ల రూపంలో ఖైరతాబాద్ ఆర్టీఏకి రూ. 30.49 లక్షల ఆదాయం వచ్చింది. ఆర్టీఏ బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో తొలి రోజు నిర్వహించిన బిడ్డింగ్ ద్వారా రూ. 3.32 లక్షలు ఆదాయం వచ్చింది. టోకి చౌకి కార్యాలయానికి రూ. 5.38 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. అలాగే సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఈ స్పెషల్ నంబర్ల ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా రూ. 8.52 లక్షల ఆదాయం వచ్చింది. దీన్ని బట్టి చూస్తే.. స్పెషల్ నంబర్లకు ఎంతటి క్రేజ్ ఉందో అర్థమౌతుంది.