iDreamPost
android-app
ios-app

టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ

టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)నోటిఫికేషన్ ను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు కొనసాగనుంది. ఇక సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించి అదే నెల 27న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అభ్యర్థులు ఎన్నో రోజుల నుంచి ఈ టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వెలువడడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పేపర్-1 పరీక్షకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే వెసులుబాటును కల్పించారు. బీఈడీకి అర్హత సాధించిన అభ్యర్థులు పేపర్-2తో పాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు ఫీజును రూ.400గా నిర్ణయించింది విద్యాశాఖ. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. మరో విషయం ఏంటంటే? ప్రస్తుతం విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే విద్యార్థులు కూడా ఈ టెట్ అర్హులేనని నోటిఫికేషన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్‌.. వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!