iDreamPost
android-app
ios-app

అమెరికాలో మిస్సైన హైదరాబాద్‌ యువతి నితీషా క్షేమం..

  • Published Jun 05, 2024 | 1:58 PM Updated Updated Jun 05, 2024 | 2:00 PM

Nitisha Kandula: కొన్ని రోజుల క్రితం అమెరికాలో హైదరాబాద్‌ యువతి నితీషా కందుల మిస్సైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

Nitisha Kandula: కొన్ని రోజుల క్రితం అమెరికాలో హైదరాబాద్‌ యువతి నితీషా కందుల మిస్సైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 05, 2024 | 1:58 PMUpdated Jun 05, 2024 | 2:00 PM
అమెరికాలో మిస్సైన హైదరాబాద్‌ యువతి నితీషా క్షేమం..

విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి కోసం వెళ్తున్న భారతీయ యువతీయువకులు వరుస ప్రమాదాలకు గురవుతుండటం గందరగోళానికి గురి చేస్తుంది. మరీ ముఖ్యంగా అమెరికాలో ఈ తరహా దారుణాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. దాంతో అసలు అగ్ర దేశం సేఫేనా అనే చర్చ జరుగుతోంది. విద్య, ఉపాధి కోసం అమెరికా వెళ్లాలంటే.. భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈక్రమంలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ యువతి నితీషా.. గత నెల 28న మిస్సైన సంగతి తెలిసిందే. వారం రోజుల నుంచి ఆమె ఆచూకీ కోసం గాలిస్తుండగా.. ఇప్పుడు ఆమె క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం నాడు నితీషా ఆచూకీ లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. దాంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఊపిరి పీల్చుకున్నారు.

నిజామాబాద్‌కు చెందిన నితీషా కందుల అనే యువతి కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ, శాన్‌ బెర్నార్డినోలో ఎంఎస్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె గత నెల అనగా మే 28 నుంచి కనిపించకుండా పోయింది. చివరిసారిగా ఆమె లాస్‌ఏంజిల్స్‌లో కనిపించినట్లు యూనివర్సిటీ యాజమాన్యం.. ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మళ్లీ ఆ తర్వాత ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు వారం రోజుల తర్వాత కాలిఫోర్నియాలో ఆమె ఆచూకీ లభించింది. నితీషాను గుర్తించడంలో స్థానికుల తమకు ఎంతో సాయం చేశారని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం నితీషా ఎక్కడ ఉన్నది.. అన్న వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. తాము కాపాడిన యువతి పేరు చెప్పలేదు. కానీ ఆమె క్షేమంగా ఉందని పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో నితీషా తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక త్వరలోనే ఆమె ఇండియా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి నితీషాను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా..లేదంటే ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుని ఇన్నాళ్లు కనిపించలేదా అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

ఇక గత నెల షికాగోలో రూపేష్‌చంద్ర చింతకింద అనే విద్యార్థి కూడా మిస్సైన సంగతి తెలిసిందే. అంతకు ముందు మార్చిలో కనిపించకుండా పోయిన క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోన్న హైదరాబాద్ యువకుడు మహ్మద్ అబ్దుల్ అరాఫత్.. ఏప్రిల్‌లో శవమై కనిపించాడు. దీనికి ముందు భారత్‌కు చెందిన సంప్రదాయ నాట్య శిక్షకురాలు అమర్‌నాథ్ ఘోష్‌ను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌తో దారుణ హత్యకు గురైంది. ఇక పర్ద్యూ యూనివర్సిటీలో చదువుతోన్న ఇండియన్‌ అమెరికన్ సమీర్ కామంత్‌ ఫిబ్రవరి 5న ఇండియానాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇలా భారతీయ విద్యార్థులు వరుసగా మిస్సవ్వడం, హత్యకు గురి కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.