అభివృద్దే లక్ష్యంగా.. తెలంగాణను 3 జోన్లుగా విభజిస్తున్నాం: సీఎం రేవంత్‌

Telangana Formation Day: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభ పరేడ్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana Formation Day: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభ పరేడ్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

నేడు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది అన్నారు.ఆరు దశాబ్దాల కల సాకారం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ అభివృద్ది కోసం కాంగ్రెస్ అహర్శిశలూ చిత్త శుద్దితో పని చేస్తుందని అన్నారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనం ఎంతైనా అవసరం ఉంది.. అందుకే రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నా అని అన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్భన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని సబ్ అర్బన్, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ జోన్లుగా విభజిస్తున్నట్లు వెల్లడించారు. ఇదంతా తెలంగాణ అభివృద్ది కోసం ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో మూడు జోన్ల అభివృద్ది ప్రణాళికను ప్రకటిస్తామని అన్నారు.

తెలంగాణ ప్రజలు పరాయి పాలనతో పీడింపబడ్డారు.. రాష్ట్ర ప్రజల స్వేచ్ఛపై దాడి జరిగింది. ప్రజల సంపద గెప్పెడు మంది చేతుల్లోకి వెళ్లింది.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు విధ్వంసానికి గురయ్యాయి.ఇకపై తెలంణపై ఎలాంటి అరాచకాలు జరగవు.. అభివృద్ది లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందడుతు వేస్తుంది. ఎన్ని దుష్ట శక్తులు ఎదురైనా.. అడ్డు వచ్చినా తెలంగాణ ప్రగతి పధంలో నడిపించి తీరుతాం. తక్కువ ఖర్చతో ఎక్కువ నీటిని ఇచ్చే సాగు నీటి ప్రాజెక్ట్ పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని ఇస్తామని, డ్రగ్స్, గంజాయి విషయంలో ఉక్కపాదంతో అణచివేస్తామని అన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. ప్రజల కోసం ఎన్నికైన ప్రభుత్వం తెలంగాణలో ఉందన్న సీఎం ప్రజా ప్రభుత్వం జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం అని అన్నారు.

Show comments