P Venkatesh
మీరు క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తింటున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తినడం ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ నిర్దారించింది.
మీరు క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తింటున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తినడం ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ నిర్దారించింది.
P Venkatesh
చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్స్ ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో చాక్లెట్స్ తినాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన చాక్లెట్స్ లభిస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి క్యాడ్‌బరీ చాక్లెట్ కొన్నాడు. రాపర్ ఓపెన్ చేసి తీరా తిందామనుకునే సరికి సజీవంగా ఉన్న పురుగు కనిపించింది.
దీంతో ఆ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తినడంపై తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ నిర్దారించింది. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ తినకూడదని వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్నప్తి చేసింది.
అయితే క్యాడ్‌బరీకి చెందిన అన్ని రకాల చాక్లెట్స్ కాకుండా కేవలం రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ మాత్రమే సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ స్పష్టం చేసింది. అమీర్ పేట మెట్రోస్టేషన్ లో కొనుగోలు చేసిన క్యాడ్ బరీ చాక్లెట్ లో పురుగులున్న ఆ శాంపిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ల్యాబ్ లో విశ్లేషణ చేసిన అధికారులు అందులో వైట్ వార్మ్స్ (తెల్ల పురుగులు) ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆక్ట్ 2006 ప్రకారం క్యాడ్‌బరీ రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ సురక్షితం కాదని నిర్ధారించారు.
అప్డేట్:
క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తినడం సురక్షితం కాదని నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ. https://t.co/QEN8EOd1hj pic.twitter.com/Kr8jDrqXWb
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2024