iDreamPost
android-app
ios-app

తెలంగాణలో TS కాదు TG.. పాత వాళ్ళు నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా?

  • Published Feb 05, 2024 | 2:08 PM Updated Updated Feb 05, 2024 | 2:08 PM

Telangana State Change Ts To Tg: ఇటీవల తెలంగాణలో కొలువదీరిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Telangana State Change Ts To Tg: ఇటీవల తెలంగాణలో కొలువదీరిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో TS కాదు TG.. పాత వాళ్ళు నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు మారినపుడు వాటి విధానాలు, పాలనా శైలి మారుతుంది. ఇది కాంగ్రెస్ హయాంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం పేరు సైతం మార్చారు. ఇక నుంచి టీఎస్ (TS)ని టీజీ (TG)గా మారుస్తూ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రాష్ట్ర పేరు మార్పుతో ప్రజల్లో తమ వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ సర్కార్ రాష్ట్ర పేరు టీఎస్ (TS)ని టీజీ (TG)గా మారుస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రజలకు తమ వాహన నెంబర్ ప్లేట్ల విషయంలో కొత్త డౌట్ మొదలైంది.. దీనిపై చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న అనధికార సమాచారం మేరకు టీఎస్ నెంబర్ ప్లేట్లను మర్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ జీవో వచ్చిన తర్వాత అప్పటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ కేటాయిస్తారని తెలుస్తుంది. గతంలో టీఎస్ పేరుపై ఉన్న నెంబర్ ప్లేట్లను మార్చాల్సిన అవసరం లేదని.. అవి యధావిధిగా కొనసాగుతాయి. కొత్తగా వచ్చినవాటికే మార్చాల్సి ఉంటుందని అధికారుల వర్షన్.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగాయి. ఏపీ పోయి.. టీఎస్ ఎలా వచ్చిందో.. అదే ప్రక్రియ ఇప్పుడు కూడా కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ జీవో వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ ఉంటుంది. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ పేరుతో ఉన్న వాహనాల నెంబర్లు ప్లేట్లు మార్చాలీ అంటే మాత్రం పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారుతుందని.. కొన్ని లక్షల వాహనాలు ఉంటాయని, అవన్నీంటికి మార్చం అంటే చాలా కష్టం అని అంటున్నారు. ఒకవేళ అలాంటి విషయం ఉంటే అధికారికంగా ప్రకటిస్తారని.. అప్పటి వరకు వాహనదారులు ఎవరూ తమ నెంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవాల్సిన అవసరం లేదు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ విషయంపై ఎలాంటి రూమర్లను కూడా పట్టించుకోవొద్దు అని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.