iDreamPost
android-app
ios-app

అఫీషియల్‌: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు ఇవే!

Telangana Congress Ministers & Their Department's: గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మంత్రులకు కేటాయించిన శాఖలు వివరాలు ఇవే..

Telangana Congress Ministers & Their Department's: గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మంత్రులకు కేటాయించిన శాఖలు వివరాలు ఇవే..

అఫీషియల్‌: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు ఇవే!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గురువారం ఎల్బీ స్టేడియంలో ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకరం చేశారు. అనంతరం మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరికి  ఏ శాఖ ఇచ్చారనేది అందరిలో ఆసక్తి ఉంది. అయితే తాజాగా మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. మరి… ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారో.. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మంత్రులకు కేటాయించిన శాఖలు:

  • మల్లు భట్టి విక్రమార్క(ఖమ్మం జిల్లా) – ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి (సూర్యపేట జిల్లా) – హోం శాఖ
  • దుద్దిళ్ల శ్రీధర్ బాబు (పెద్దపల్లి జిల్లా)  -ఆర్థిక శాఖ
  • దామోదర రాజనర్సింహ( సంగారెడ్డి జిల్లా) – ఆరోగ్య శాఖ
  • కోమటి రెడ్డి వెంకట రెడ్డి (నల్గొండ జిల్లా) –  పురపాలక శాఖ
  • పొంగులేటి శ్రీనివాస్ (ఖమ్మం జిల్లా) – నీటి పారుదల శాఖ
  • పొన్నం ప్రభాకర్ (కరీంనగర్ జిల్లా) – బీసీ సంక్షేమ శాఖ
  • సీతక్క (ములుగు జిల్లా) – గిరిజన సంక్షేమ శాఖ
  • కొండ సురేఖ ( వరంగల్ జిల్లా) – మహిళా శిశు సంక్షేమ శాఖ
  • జూపల్లి కృష్ణారావు ( నాగర్ కర్నూలు జిల్లా) – పౌరసరఫరాల శాఖ
  • తుమ్మల నాగేశ్వరావు ( ఖమ్మం జిల్లా) – రోడ్ల భవనాల శాఖ మంత్రి

ఇలా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఐటీ శాఖను మాత్రం ఎవరికి కేటాయించలేదు. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఈ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, గడ్డం ప్రసాదరావుకు స్పీకర్‌ బాధ్యతలు ఇచ్చారు. మరి..  తెలంగాణ కొత్త మంత్రులు, వారికి కేటాయించిన శాఖలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి