P Venkatesh
బర్రెలక్క భద్రత విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తనకు భద్రత కల్పించాలని కోరుతు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో శిరీషకు అలియాస్ బర్రెలక్కకు భద్రత కల్పించాలని ఆదేశించింది.
బర్రెలక్క భద్రత విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తనకు భద్రత కల్పించాలని కోరుతు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో శిరీషకు అలియాస్ బర్రెలక్కకు భద్రత కల్పించాలని ఆదేశించింది.
P Venkatesh
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారింది కొల్లాపూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలోనిలిచింది. నామినేషన్ వేసింది మొదలు తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తోంది. బర్రెలక్కకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెపైన, కుటుంబ సభ్యులపైన దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల బర్రెలక్క తమ్ముడిపై కొందరు వ్యక్తులు దాడిచేశారు. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అయితే పోలీసుల నుంచి మద్దతు రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది బర్రెలక్క. శిరీష వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా శిరీష అలయాస్ బర్రెలక్క పోటీచేస్తున్నది. బర్రెలక్క తనకు రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. బర్కెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగులకు భద్రత కల్పించాలని, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఇది కొనసాగాలని హైకోర్టు అధికారులకు సూచించింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దే అని హైకోర్టు తెలిపింది. బర్కెలక్కకు ఒక గన్ మెన్ తో భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించింది.
కాగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తనకు భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ పొందిన శిరీష అలియాస్ బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. కొల్లాపూర్ నుంచి పోటీచేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరలేపింది బర్రెలక్క. శిరీషకు మద్దతుగా ప్రజలతో పాటు సోషల్ మీడియా కూడా అండగా నిలుస్తోంది.