DSC Notification: నిరుద్యోగులకు శుభశార్త.. త్వరలోనే కొత్త DSC.. ఎప్పుడు.. ఎన్ని పోస్టులంటే..

DSC Notification-January 2025: తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ త్వరలోనే శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ వివరాలు..

DSC Notification-January 2025: తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ త్వరలోనే శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ వివరాలు..

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన తీవ్రతరం అవుతుంది. మరీ ముఖ్యంగా డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ.. అభ్యర్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు. అంతేకాక సెక్రటేరియట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. దాంతో పోలీసులు.. ఎక్కడికక్కడ నిరుద్యోగులను అడ్డుకున్నారు. దీంతోపాటు గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో 1:100 క్వాలిఫై చేయాలని.. గ్రూప్‌ 2, 3 పోస్టులను పెంచడమే కాక.. పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. డీఎస్సీ నిర్వహణకే కట్టుబడి ఉంది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇక ఈసారి డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే రేవంత్‌ సర్కార్‌ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రేవంత్‌ సర్కార్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 11,062 పోస్టులకు డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 18 నుంచి ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రటించింది. ఈ ప్రకటనలో మొత్తం 5 వేలకుపైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

అంతేకాకుండా ఇకపై ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని.. జూన్‌లో ఒకటి, డిసెంబర్‌లో మరొకటి నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీఓ జారీ చేసింది. ఆ ప్రకారంగా ఈ డిసెంబరులో టెట్‌ పరీక్ష నిర్వహించిన తర్వాత.. ఆ వెంటనే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అప్పుడు అభ్యర్థులు డీఎస్సీకి ప్రిపేర్‌ అవ్వడానికి సమయం బాగానే లభిస్తుందని.. 45-60 రోజుల గ్యాప్‌ దొరకనుంది అని చెబుతున్నారు.

మొత్తం ఖాళీలెన్ని అంటే..

తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరానికి 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. అందులో 10,449 మంది భాషా పండితులు, పీఈటీలకు ప్రమోషన్‌ ఇచ్చారు. దీని వల్ల కొత్త ఖాళీలు వచ్చే అవకాశం లేదు. దీంతో మిగిలినవి 9,268 ఖాళీలు మాత్రమే. ఇక రాష్ట్రంలో ప్రతి నెల సగటున 200-300 మంది వరకు టీచర్లు పదవీ విరమణ పొందుతుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు మొత్తం 1,25,058 ఉండగా.. వీటిల్లో 1.03 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. జులై 18న ప్రారంభమయ్యే డీఎస్సీ ద్వారా 11,062 మంది కొత్త టీచర్లు భర్తీ అయితే.. మిగిలిన పోస్టుల భర్తీ కోసం.. కొత్త డీఎస్సీ నోటిఫికేన్‌ వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Show comments