Dharani
TG Govt-2nd Phase Rythu Runa Mafi Funds On July 30th: తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. ఆ వివరాలు..
TG Govt-2nd Phase Rythu Runa Mafi Funds On July 30th: తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత జర్నీతో పాటు.. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచడం చేసింది. ఇందిరమ్మ ఇళ్లు పథకం కూడా ప్రారంభించింది. వీటితో పాటు తాము అధికారంలోకి వస్తే.. ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాపీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా దాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ముందుగా లక్ష రూపాయల వరకు లోన్ తీసుకున్న రైతుల రుణాన్ని మాఫీ చేశారు. జూలై 18న దీనికి సంబంధించి అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.1 లక్ష వరకు ఉన్న రుణ మాఫీ మొత్తాన్ని జమ చేశారు. వడ్డీతో పాటు.. కలిసి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇక రెండో విడతలో భాగంగా.. ఇక రూ.1.50 లక్షల రుణం ఉన్న రైతలకు జులై 31వ తేదీ లోపు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మంగళవారం నాడు ఈ నిధులను విడుదల చేసింది.
రెండు విడతల్లో కలిపి మొత్తం 18 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే.. రూ.1.50 లక్షల వరకు రుణాలు కలిగి మాఫీ అయిన వారి జాబితాను అధికారులు విడుదల చేశారు. మరి ఈ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో తెలియాలంటే.. https://clw.telangana.gov.in/Login.aspx వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. రెండు విడతల్లో కలిపి 18 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. దీనిలో గరిష్టంగా గద్వాల్ జిల్లాలో గరిష్టంగా 16 వేల మందికి పైగా రైతులకు రుణమాఫీ కాగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా నలుగురికి రైతు రుణమాఫీ అయ్యింది. ఈ నలుగురి పేరు మీద 5 లక్షల రుణమాఫీ జరిగింది.
అయితే అర్హులైన రైతులకు ఇంకా రుణమాపీ కాలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీని కోసం అన్నదాతలు జిల్లాలోని వ్యవసాయాధికారులు, బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగతున్నారు. త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక తొలివిడత రూ. 6,098 కోట్లతో 11.42 లక్షల మంది రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేశారు. రెండో విడతలో రూ.6,500 కోట్లతో 7 లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేశారు. రెండు విడతల్లో కలిపి కేవలం 18.42 లక్షల మందికే రుణమాఫీ వర్తిస్తున్నది. ఇక రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను ఆగస్టు 15వ తేదీలోపు మాఫీ చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన లిస్ట్‌ను కూడా విడుదల చేస్తారు.