Praja Palana: ప్రజాపాలన దరఖాస్తు ఫారం.. అన్ని పథకాలకు ఒకే అప్లికేషన్‌.. కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే..

Telangana Praja Palana Application Form: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీల అమలు దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో అన్ని పథకాలకు వర్తించే ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ని విడుదల చేసింది. ఆ వివరాలు..

Telangana Praja Palana Application Form: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీల అమలు దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో అన్ని పథకాలకు వర్తించే ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ని విడుదల చేసింది. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఎలక్షన్లకు ముందే ఆరు గ్యారెంటీల పేరుతో పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. అధికారంలోకి రాగానే.. వాటి ఫైల్ మీదే ముందుగా సంతకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారులను గుర్తించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ప్రజాపాలన.. ఈనెల 28 నుంచి అనగా నేటి నుంచి..  జనవరి 6 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. పది రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. అయితే.. ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి.. వాటిలో ఏమేం వివరాలు ఇవ్వాలి.. ఏ డాక్యుమెంట్లు కావాలి.. ఇలా అనేక సందేహాలున్నాయి జనాలకు. వాటన్నింటికి సమాధానంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రజా పాలన దరఖాస్తు ఫారం విడుదల చేసింది. ఆవివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలు కోసం.. అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం సిద్ధం చేసింది. అయితే.. ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. అన్నింటికీ ఒకేసారి దరఖాస్తు పెట్టుకునేలా సర్కార్ దీన్ని తయారు చేసింది. మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ కుటుంబ వివరాల్లో భాగంగా యజమాని పేరుతో మొదలై.. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కులంతో పాటు మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది.
ఆ తర్వాత.. వరుసగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఆ పథకం కింద అడిగిన వివరాలను అక్కడ నమోదు చేయాలి.

మహాలక్ష్మి…

  • మీరు కనక ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందెందేంకు అర్హులు అయితే..
  • అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్కు పెట్టాల్సి ఉంటుంది.
  • అలానే రూ.500 సబ్సీడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్లు
  • గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజన్సీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

రైతు భరోసా..

  • రైతు భరోసా పొందాలనుకునే వారు.. తాము రైతా.. లేక కౌలు రైతా అన్న దగ్గర టిక్ చేయాలి.
  • రైతు అయితే పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, సాగు చేస్తున్న భూమి ఏకరాలను పేర్కొనాలి.
  • ఒకవేళ రైతు కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి.

ఇందిరమ్మ ఇళ్లు..

  • ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తోన్న వారు..
  • ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి.
  • ఒకవేళ అమరవీరుల కుటుంబానికి చెందినవాళ్లయితే.. పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబర్, డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి.
  • అదే ఉద్యమకారులైతే.. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్, లేదా జైలుకు వెళ్లిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

గృహ జ్యోతి..

  • ఇక గృహ జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు..
  • నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తారన్నది యూనిట్లలో పేర్కొనాల్సి ఉంటుంది.
  • దానితో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

చేయూత..

  • ఇక చేయూత పథకం కింద సాయం పొందాలనుకునేవాళ్లు..
  • దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి.
  • వృద్ధులా, వితంతువుల, బీడీ కార్మికులా, చేనేత కార్మికులా అన్నది వాళ్లకు సంబంధించిన బాక్సులో టిక్ చేయాల్సి ఉంటుంది.
  • పైన పేర్కొన్న వివరాలు ఇచ్చాక.. కింద.. దరఖాస్తు దారుని పేరు, సంతకం, తేదీ వంటీ వివరాలు నమోదు చేయాలి.

ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్‌ను కూడా జతపర్చాల్సి ఉంటుంది. ఇలా నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించి.. వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.

Show comments