P Venkatesh
New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు.
New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు.
P Venkatesh
రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందాలంటే రేషన్ కార్డు తప్పని సరి కావడంతో రేషన్ కార్డు లేని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రజాపాలనను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు.
రాష్ట్రంలో మరోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతిఒక్కరికి హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులను గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి వార్షిక ఆదాయం లక్షన్నరతో పాటు మూడున్నర ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాల చెలక.. ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. ఇక.. పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారి వార్షిక ఆదాయం 2 లక్షలు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోసారి ప్రజా పాలన నిర్వహించనుండడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీతో వేలాది మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనున్నది.