ప్రజాపాలన కార్యక్రమానికి TS సర్కార్ బ్రేక్.. ఆ రెండు రోజులు ఏ దరఖాస్తులు తీసుకోరు!

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం విరామం ఇచ్చింది. ఆ రెండు రోజులు సెలవు ప్రకటించడంతో ఆ తేదీల్లో ఏవిధమైన దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేసింది. ఆ వివరాలు మీకోసం..

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం విరామం ఇచ్చింది. ఆ రెండు రోజులు సెలవు ప్రకటించడంతో ఆ తేదీల్లో ఏవిధమైన దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేసింది. ఆ వివరాలు మీకోసం..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటి సారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ మానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతోంది టీఎస్ సర్కార్. ప్రజాపాలనలో ఆరుగ్యారంటీలకు ఆర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఈ దరఖాస్తుల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ ఇచ్చింది. ఆ రెండు రోజులపాటు ఎలాంటి దరఖాస్తులు తీసుకోబడవని స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి ప్రారంభం కాగా వచ్చే సంవత్సరం జనవరి 6 2024 వరకు కొనసాగనున్నది. ఆరు గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరుతో గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తూ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించటం ప్రారంభించింది. ఇప్పటికే ప్రజలు దరఖాస్తులు చేసుకునేందుకు పోటెత్తుతుండటంతో రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజాపాలన కార్యక్రమానికి రెండు రోజుల పాటు ప్రభుత్వం విరామం ఇచ్చింది. రేపు (డిసెంబర్ 31) ఆదివారం సెలవుదినం కాగా సోమవారం రోజు (జనవరి 1) కొత్త సంవత్సరం కావటంతో రెండు రోజుల పాటు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. సెలవుల అనంతరం మళ్లీ జనవరి 02 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు యథావిధిగా ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.

అయితే ప్రజాపాలన దరఖాస్తులకు కేవలం 10 రోజుల సమయం ఇచ్చి అందులో రెండు రోజులు సెలవులుగా ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. కాగా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ పది రోజులు మాత్రమే ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంటుంది.. తర్వాత తీసుకోదన్న అపోహ అవసరం లేదని స్పష్టం చేశారు.

గడువు ముగిసిన తర్వాత కూడా ఎమ్మార్వో ఆఫీసుల్లో ప్రజలు తమ దరఖాస్తులను సమర్పించొచ్చని సీఎం రేవంత్ వెల్లడించారు. అదేవిధంగా దరఖాస్తు ఫామ్ ల పై మాట్లాడుతూ.. ప్రజలు ఎవరూ డబ్బులు పెట్టి దరఖాస్తులు కొనవద్దని అప్లికేషన్ ఫామ్‌లను అమ్మేవారిపై మండిపడ్డారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని అప్లికేషన్ ఫామ్ లను అందుబాటులో ఉంచాల్సిందేనంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Show comments