P Venkatesh
Kalyana Laxmi: తెలంగాణలోని ఆడపడుచులకు రేవంత్ సర్కార్ తీపికబురును అందించింది. కళ్యాణ లక్ష్మీ పథకానికి సంబంధించిన నిధులను రిలీజ్ చేసింది. వారి అకౌంట్లలోకి లక్ష రూపాయలు జమకానున్నాయి.
Kalyana Laxmi: తెలంగాణలోని ఆడపడుచులకు రేవంత్ సర్కార్ తీపికబురును అందించింది. కళ్యాణ లక్ష్మీ పథకానికి సంబంధించిన నిధులను రిలీజ్ చేసింది. వారి అకౌంట్లలోకి లక్ష రూపాయలు జమకానున్నాయి.
P Venkatesh
ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తలప్రాణం తోకకొస్తుంది. వరునికిచ్చే కట్న కానుకలు, భోజనాల ఖర్చు, డెకరేషన్, ఇతరత్రా ఖర్చులు అన్నీ కలుపుకుని తడిసిమోపెడవుతున్నాయి. ఆడపిల్లలున్న పేద కుటుంబాల వారు కూతుర్ల పెళ్లిళ్ల విషయంలో ఆర్థిక పరిస్థితి బాగా లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి వారికి అండగా ఉండేందుకు గత బీఆర్ ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లి ఖర్చులకు రూ. లక్షా పదహార్లు అందిస్తుంది. ఈ క్రమంలో ఆడపడుచులకు రేవంత్ సర్కార్ శుభవార్తను అందించారు. కళ్యాణ లక్ష్మీ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం రిలీజ్ చేసింది.
తెలంగాణలోని ఆడపడుచుల అకౌంట్లో లక్ష రూపాయలు జమకానున్నాయి. అయితే ఇది అందరికి కాదండోయ్. కొత్తగా పెళ్లైన వధువులకు బీసీ, ఈబీసీ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన ఫండ్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. రూ.1225.43 కోట్ల నిధులను విడుదల చేసింది. కాగా పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న లబ్దిదారులకు కూడా ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఇప్పటికే వేల సంఖ్యలో కళ్యాణ లక్ష్మీ పథకానికి అప్లై చేసుకున్నారు. వీరందరికీ లబ్ధి చేకురనున్నది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ ఇంకా కార్యరూపందాల్చలేదు. నగదుతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పక్షాలు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక తాజాగా కళ్యాణ లక్ష్మీ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ బీసీల మీద ఉన్న ప్రేమతో.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఈ కళ్యాణ లక్ష్మి నిధులు విడుదల చేశారని పొన్నం ప్రభాకర్ తెలిపారు.