iDreamPost
android-app
ios-app

యువతులకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలు.. పంపిణీకి రంగం సిద్ధం!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీకి సంబంధించిన ప్రక్రియపై కసరత్తు ప్రారంభించినట్లు సమచారం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీకి సంబంధించిన ప్రక్రియపై కసరత్తు ప్రారంభించినట్లు సమచారం.

యువతులకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలు.. పంపిణీకి రంగం సిద్ధం!

తెలంగాణలో తొలి సారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టిసారించింది. ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే మహాలక్షీ పథకం, ఆరోగ్య శ్రీ 10 లక్షల వరకు పెంపు, గృహజ్యోతి వంటి పథకాలను అమలు చేస్తోంది. అదే విధంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతులకు తీపి కబురును అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. కాలేజీల్లో చదివే విద్యార్థినులకు మాత్రమే అర్హత ఉంటుంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ చదివే విద్యార్థినులందరికీ ఈ స్కూటీలు వచ్చే అవకాశం ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు తప్పని సరి చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో శాశ్వతంగా నివసించే వారికి మాత్రమే అందించనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏజ్ సర్టిఫికేట్, ఆదాయ, కుల దృవీకరణ పత్రాలు, రెసిడెన్సీ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఈ మెయిల్ ఐడీ కలిగి ఉండాలని తెలుస్తోంది.

సంబంధిత పత్రాలతో ఆన్ లైన్ లోనే అప్లై చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వెరిఫికేషన్ తర్వాత అర్హులైన వారికి రూ. 50 వేలు విలువ చేసే స్కూటీలను అందించనున్నట్టు ప్రచారం సాగుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం ఉండదని సంబంధిత వర్గాల నుంచి సమాచారం. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీకి సంబంధించిన విధివిధానాలు, దరఖాస్తు చేసుకునే వివరాలను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు సమాచారం.