Telangana Government: రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం!

రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం!

Telangana Government: తెలంగాణలో రైతులకు వరుసగా శుభవార్తలు అందింస్తుంది రేవంత్ సర్కార్. పంద్రాగస్టు వరకు రైతులకు రెండు లక్షల రుణాల మాఫీ చేయబోతున్నారు. తాజాగా మరో గుడ్ న్యూస్ అందించారు.

Telangana Government: తెలంగాణలో రైతులకు వరుసగా శుభవార్తలు అందింస్తుంది రేవంత్ సర్కార్. పంద్రాగస్టు వరకు రైతులకు రెండు లక్షల రుణాల మాఫీ చేయబోతున్నారు. తాజాగా మరో గుడ్ న్యూస్ అందించారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చే పనిలో ఉన్నారు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రాజీవ్ ఆగోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల బీమా, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ప్రారంభించారు. తెలంగాణలో విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా అన్నదాతల విషయంలో రేవంత్ సర్కార్ పాజిటీవ్ గా వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పది వేలు నష్టపరిహారం అందించారు. తాజాగా తెలంగాణ రైతులకు మరో శుభవార్త అందించింది రేవంత్ సర్కార్. వివరాల్లోకి వెళితే..

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎల్‌ఐసీ కింద ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం ఎంత చెల్లించాలనేది త్వరలో ఖరారు కానుంది. రైతు బీమా పథకం ద్వారా రైతులు సహజంగా, లేదా ఏ విధంగానైనా మరణిస్తే, సదరు రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి 2024-25 రైతు బీమా సంవత్సరం మొదలు కాబోతుంది.

18-59 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ స్కీమ్ కు అర్హులు. దీంతో 60 ఏళ్లు నిండిన వారిని ఈ పథకం నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగతా అర్హులైన 45.13 లక్షల మందికి బీమాను కాంగ్రెస్ సర్కార్ రెన్యూవల్ చేయనుంది. ఈ నెల 5 తో రైతు బీమా గడువు ముగియగా.. కొత్తగా 2.47 లక్షల మంది అర్హులను ప్రభుత్వం గుర్తించింది. వీరితో కలిసి మొత్తం 47.84 లక్షల మంది రైతులకు రైతు బీమా పథకం వర్తిస్తుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేయనున్నారు.మూడో విడత రుణమాఫీ రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

Show comments