iDreamPost
android-app
ios-app

కొత్త రేషన్ కార్డులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే!

Telangana New Ration cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యూ రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

Telangana New Ration cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యూ రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

కొత్త రేషన్ కార్డులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే!

ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందాలంటే రేషన్ కార్డ్ తప్పనిసరి. రేషన్ కార్డు లేని వారు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తదా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. చాలా కాలం నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి భారీ ఊరట లభించనున్నది. అర్హులైన వారందరికీ న్యూ రేషన్ కార్డులు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అయితే కొత్త రేషన్ కార్డులకు అర్హత పొందాలంటే లబ్ధిదారులకు ఈ అర్హతలుండాల్సిందే. లేదంటే రేషన్ కార్డులను పొందలేరు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏయే అర్హతలు ఉండాలంటే?

కొత్త రేషన్ కార్డులు వీరికి మాత్రమే?

కొత్త రేషన్ కార్డులు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ. లక్షన్నర,మాగాణి, 3.50 ఎకరాలు, చెలక, 7.5 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షికాదాయం రూ. 2 లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రతిపాదించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనున్నది. ఇక గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నప్పటికీ మోక్షం లభించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చాక ప్రజాపాలనలో భాగంగా లక్షలాది మంది రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం న్యూ రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.