iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. తెలంగాణలో DSC నోటిఫికేషన్ విడుదల

గుడ్ న్యూస్.. తెలంగాణలో DSC నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ 2023 నోటిఫికేషన్ ను విద్యా శాఖ ఎట్టకేలకు తాజాగా విడుదల చేసింది. ఈ ప్రకటనతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఎన్ని పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చివరి తేది ఎప్పుడు? ఎవరెవరు అర్హులు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ విద్యాశాఖ 5,089 పోస్టులతో కూడిన డీఎస్సీ 2023 నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20వ తేది నుంచి ప్రారంభం కానుంది. చివరి తేదీని అక్టోబర్ 21గా అధికారులు నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టుల విషయానికొస్తే.. ఎస్ జీటీ-2575, స్కూల్ అసిస్టెంట్-1739, లాంగ్వేజ్ పండిట్-611, పీఈటీ-164 పోస్టులు ఉన్నాయి.

అత్యధికంగా హైదరాబాద్ 358 ఖాళీలు ఉండడం విశేషం. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 309 పోస్టులు ఉన్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా విషయానికొస్తే కేవలం 43 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ఫీజును అధికారులు రూ.1000గా నిర్ణయించారు. అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించగా., SC, ST, BC EWSతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుందని తెలిపారు. దివ్యాంగుల విషయానికొస్తే.. 10 సంవత్సరాల పాటు సడలింపు ఉంటుందని అధికారులు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

జిల్లాల వారిగా పోస్టులు:

  • ఆదిలాబాద్: 275
  • ఆసిఫాబాద్: 289
  • హైదరాబాద్: 358
  • నిజామాబాద్: 309
  • సంగారెడ్డి: 283
  • కామారెడ్డి: 200
  • నల్గొండ: 219
  • ఖమ్మం: 195
  • రంగారెడ్డి: 196
  • వికారాబాద్: 191
  • సూర్యాపేట: 185
  • భద్రాద్రి కొత్తగూడెం: 185
  • నారాయణపేట: 154
  • సిద్దిపేట: 141
  • హనుమకొండ: 54
  • జగిత్యాల: 148
  • జనగాం: 76
  • జయశంకర్ భూపాలపల్లి: 74
  • జోగులాంబ: 146
  • కరీంనగర్: 99
  • మహబూబాబాద్: 125
  • మహబూబ్ నగర్: 96
  • మంచిర్యాల: 113
  • మెదక్: 147
  • మేడ్చల్: 78
  • ములుగు: 65
  • నాగర్ కర్నూల్: 114
  • నిర్మల్: 115
  • పెద్దపల్లి: 43
  • రాజన్న సిరిసిల్ల: 103
  • వనపర్తి: 76
  • వరంగల్: 138
  • యాదాద్రి: 99
  • ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి