iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. HYD- VJA హైవేపై కొత్త ఫ్లైఓవర్..!

  • Published Aug 01, 2024 | 8:14 PM Updated Updated Aug 01, 2024 | 8:14 PM

తెలుగు రాష్ట్రాలైనా హైదరాబాద్ , విజయవాడ ప్రధాన నగరాలుకు మధ్య నేషనల్ హైవే  పై ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ట్రాపిక్ సమస్యల వల్ల తరుచు అక్కడ ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ సమస్యలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు రాష్ట్రాలైనా హైదరాబాద్ , విజయవాడ ప్రధాన నగరాలుకు మధ్య నేషనల్ హైవే  పై ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ట్రాపిక్ సమస్యల వల్ల తరుచు అక్కడ ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ సమస్యలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published Aug 01, 2024 | 8:14 PMUpdated Aug 01, 2024 | 8:14 PM
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. HYD- VJA హైవేపై కొత్త ఫ్లైఓవర్..!

నగరంలో ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనా హైదరాబాద్ , విజయవాడ ప్రధాన నగరాలుకు మధ్య నేషనల్ హైవే  పై అయితే  ట్రాఫిక్ రద్దీ మాములుగా ఉండదు. ఎందుకంటే.. నిత్యం వేలాదిమంది ప్రయాణికులు వాహనాలతో  హైవేలపై వెళ్తుంటారు. దీంతో ఎక్కడ చిన్న సమస్య వచ్చి కిలో మీటర్ వరకు భారీగా వాహనాలతో హైవేలపై ట్రాఫిక్స స్తంభించుకుపోతుంది. దీంతో ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు వెళ్లాలన్నా నరకయాతన పడుతున్నారు. అయితే ఇక ఈ సమస్యలను చెక్ పెట్టడానికే వాహనదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై తెలంగాణ, ఏపీలను అనుసంధానం చేసే హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్లే..

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవే ఒకటి. ఇక ఈ నేషనల్ హైవే-65పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పైగా ఈ హైవే రెండు తెలుగు రాష్ట్రాలైనా ఏపీ, తెలంగాణకు  మధ్య ఈ రహదారి వారధిగా ఉంటుంది. కానీ, ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు రాను రాను ఎక్కువ్వడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రమాదాలను దృష్టి సారించి వాటిని  నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే ఈ హైవేపై కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్ధమైంది. కాగా, ఈ ఫ్లైఓవర్ అనేది సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద నిర్మించేందుకు రేవంత్  సర్కార్ చేస్తోంది. ఈ మేరకు ఆర్‌ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు NHAI అధికారులను కలిశారు. బుధవారం (జులై 31) అధికారులతో చర్చలు జరపగా.. వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కనుక పూర్తయితే.. వాహనదారులకు కాస్త ట్రాఫిక్  సమస్య నుంచి ఊరట లభించడంతో పాటు యూటర్న్ చేసే కష్టాలు తప్పనున్నాయి. అంతేకాకుండా..  వాహనాల పరిమితి వేగం కూడా పెరగనుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ హైవేపై దూసుకెళ్లవచ్చు. ఇకపోతే ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ రహదారి త్వరలో 6 వరుసలుగా మారనుంది. అయితే గతంలో మాత్రం ఈ జాతీయ రహదారి 2 వరసలుగా మాత్రమే ఉండేది. కానీ, 2010లో అప్పటి ప్రభుత్వం రహదారిని విస్తరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ వరకు మెుత్తం 181.50 కి.మీ మేర రహదారిని 4 వరుసలుగా డైవర్షన్ చేసింది. మరీ, త్వరలోనే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై కొత్తగా ఫ్లైఓవర్ నిర్మించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.