రుణమాఫీలో అక్రమాలు..! అధికారులపై రేవంత్ రెడ్డి సీరియస్!

Telangana Government: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలిరోజే ఆరు గ్యారెంటీ పథకాలపై సంతకం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు.

Telangana Government: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలిరోజే ఆరు గ్యారెంటీ పథకాలపై సంతకం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు.

గత ఏడాది చివరల్లో తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు 200 లకే ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ప్రారంభిచారు. ఎన్నికల వేల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే లక్షన్నర వరకు రుణమాఫీ చేయగా.. ఆగస్టు 15వ వరకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని వెల్లడించారు.రుణమాఫీలో అక్రమాలు వెలుగు చేస్తున్నాయని ఆరోపణలు రావడంతో అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నేరెవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలో పలు పథకాలు అమలు చేశారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు.ఇదిలా ఉంటే రుణమాఫీలో కొంతమంది అధికారులు చేతివాటం చూపిస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఈ విషయం సీఎం దృష్టిలోకి రావడంతో అధికారులకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇకపై రుణమాఫీల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.

ఇటీవల ప్రభుత్వం రెండు విడతలుగా లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆగస్టు 15న మూడో విడతలో రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రుణమాఫీ కానివారు అధైర్య పడవొద్దని.. సంబంధిత అధికారులకు పూర్తి వివరాలు అందించాలని కోరారు. కొంతమంది పనికట్టుకొని రుణమాఫీపై లేని పోని రూమర్లు సృష్టిస్తున్నారని.. రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయవొద్దని కోరుతున్నామన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీలో 30 వేల ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని, ఆ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే 17 వేల ఖాతాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు.

Show comments