iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయెంబర్స్ మెంట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Author Soma Sekhar Published - 06:43 PM, Tue - 25 July 23
  • Author Soma Sekhar Published - 06:43 PM, Tue - 25 July 23
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయెంబర్స్ మెంట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యారంగానికి పెద్దపీట వేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతూ.. కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. తాజాగా జరిగిన సమావేశంలో విద్యార్థుల ఫీజు రీయెంబర్స్ మెంట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు.

తెలంగాణ విద్యార్థి దేశంలోని ఏ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో సీటు సాధించినా.. అందుకు సంబంధించిన పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఫిజు రీయెంబర్స్ మెంట్ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు. కాగా.. ఈ ఫీజు రీయెంబర్స్ మెంట్ గతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే చెల్లించేవారు. ఇప్పుడు ఈ స్కీమ్ ను బీసీ విద్యార్థులకు కూడా విస్తరించడంతో.. వెనకబడిన బీసీ విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది.

ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 10 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఇందుకోసం తెలంగాణ సర్కార్ ప్రతి సంవత్సరం అదనంగా రూ. 150 కోట్లను ఖర్చు చేయనుందని మంత్రి గంగుల వెల్లడించారు. ఇక ఇప్పటికే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేసిన తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బీసీల విద్యకు పూర్తిస్థాయిలో ఫీజు రీయెంబర్స్ మెంట్ ను చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి గంగుల పేర్కొన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థుల కొరకు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంట నూనె ధరలు!