iDreamPost
android-app
ios-app

తెలంగాణలో అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు! అర్హులు వీరే!

  • Published Dec 19, 2023 | 8:03 AM Updated Updated Dec 19, 2023 | 8:03 AM

తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు.

తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు.

తెలంగాణలో అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు! అర్హులు వీరే!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరు గ్యారెంటీల‌పై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలోనే మహలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన వారికి 10 లక్షల రూపాయల చేయూత పథకాన్ని ప్రారంభించారు. అంతేకాదు ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చి ‘ప్రజా వాణి’ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్  మరో కొత్త పథకానికి అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ మహాలక్ష్మి పథకాన్ని , అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల చేయూత పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు మరో కీలక పథకం అమలుకు అడుగులు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల హామీలో చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పథకం 18 ఏళ్లు నిండి చదువుకునే అమ్మాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన యువతులు ఎంతమంది ఉన్నారు అనేదానిపై గణాంకాలు సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

electric scooters for womens in telangana

ఈ పథకం డిస్టెన్స్ లో చదువుతున్న యువతులకు వర్తించదని, రెగ్యూలర్ గా కాలేజీలకు వెళ్లీ అమ్మాలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా అధికారులు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందేకాదు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారే ఈ పథకానికి అర్హులు అని అంటున్నారు. డ్రైవింగ్ పై అవగాణ లేకుండా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రోడ్లపై డ్రైవింగ్ చేయగల అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే రాయితీలు ఇస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ పథకంపై గైడ్ లైన్స్ రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. యువ ఓటర్లను ఆకర్షించే విధంగా అనేక పథకాలను మేనిఫెస్టోలో పొందు పరిచింది కాంగ్రెస్ పార్టీ.. ఇందులో బాగంగానే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీ పథకం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండ.ి