iDreamPost
android-app
ios-app

EdCET ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి

రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు టీజీ ఎడ్ సెట్ అధికారిక వెబ్ సైట్ లోకి ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు టీజీ ఎడ్ సెట్ అధికారిక వెబ్ సైట్ లోకి ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

EdCET ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి

ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునే వారు వృత్తి విద్యా కోర్సు అయినటువంటి బీఈడీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులో ప్రవేశం కోసం ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చే మార్కులతో బీఈడీ కాలేజీల్లో సీటు పొందొచ్చు. ప్రతి ఏడు బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్ సెట్ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో మే 23న ఎడ్ సెట్ ఎంట్రెన్స్ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన ప్రిలిమరీ కీని అధికారులు ఇటీవల విడుదల చేశారు.

ఎడ్ సెట్ పరీక్ష రాసిన వేలాది మంది విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. తాజాగా ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నాగర్‌కర్నూలుకు చెందిన నవీన్‌కు మొదటి ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన అషిత రెండు, మూడో ర్యాంకులో శ్రీతేజ నిలిచారు. ఎడ్‌సెట్‌కు 29,463మంది దరఖాస్తు చేసుకోగా.. 28,549మంది (96.90%) ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు.

ర్యాంకు కార్డు డౌన్ లోడ్ కోసం..

  • అభ్యర్థులు ముందుగా టీజీ ఎడ్ సెట్ https://edcet.tsche.ac.in/ అధికారిక వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
  • తర్వాత హోంపేజీలో డౌన్ లోడ్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి.
  • తర్వాత పేజీలో అభ్యర్థి ఎడ్ సెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
  • ఇప్పుడు వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి.
  • స్క్రీన్ పై విద్యార్థి ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది. ఇప్పుడు ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవచ్చు.