P Krishna
Good News for Peasant Worker: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతుంది. తాజాగా రైతు కూలీలకు గుడ్ న్యూస్ చెప్పింది.
Good News for Peasant Worker: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతుంది. తాజాగా రైతు కూలీలకు గుడ్ న్యూస్ చెప్పింది.
P Krishna
గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశారు. ఇక రైతులుకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశారు. తాజాగా రైతు కూలీలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో భూమి లేని రైతు కూలీలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గొప్ప శుభవార్త చెప్పారు. రైతు కూలీలకు ప్రతి ఏడాది 12 వేల చొప్పున ఇచ్చే ఆలోచన చేస్తుందని తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల చేత, ప్రజల అవసరాల కోసం ఏర్పడినదే ఈ ప్రజా పాలన ప్రభుత్వం. భారత రాజ్యంగం మేరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ప్రజా స్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ ప్రజా పాలనను స్వాగతించాలి’ అని అన్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాపై నమ్మకాన్ని ఉంచి గెలిపించారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతామని అన్నారు.
గత ప్రభుత్వ పాలనలో దోచుకోవం.. పంచుకోవడానికే సరిపోయింది.. దీంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి ఇవ్వలేని పాలన కొనసాగింది. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి జీతాలు తీసుకుంటు సంతోషంలో ఉన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇక రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెలబెట్టుకుంటున్నాం. ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ చేశాం. ఇటీవల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. రైతులకు పంట, వ్యక్తి ఇన్సూరెన్స్ తో పాటు సోలార్ పంపు సెట్లతో ఆదాయం సమకూరేలా ప్రణాళికలు సిద్దం చేస్తామన్నారు. భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. అంతేకాదు పక్కదారి పట్టిన దళితబంధు యూనిట్లు తిరిగి తెచ్చే బాధ్యత అధికారులదే అన్నారు.