Tirupathi Rao
CM Revanth Reddy On Rythu Runa Mafi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అంటూ వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy On Rythu Runa Mafi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అంటూ వ్యాఖ్యానించారు.
Tirupathi Rao
ప్రస్తుతం తెలంగాణ రైతులు అంతా ఎదురుచూస్తున్నది రైతు రుణమాఫీ కోసమే. ఇప్పటికే రేవంత్ సర్కార్ రుణమాఫీ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేసి తీరుతాం అని చెప్పారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల అవుతాయని తెలిపారు. అలాగే రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత రైతు బంధు, రైతులకు సంబంధించిన మిగిలిన పథకాలపై దృష్టి సారిస్తామని వ్యాఖ్యానించారు. రైతులకు రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని స్పష్టం చేశారు.
రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామనే హామీపై మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మరో 4 రోజుల్లో రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల తర్వాత తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు. వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ ఉండాలని అధికారులకు సూచించామన్నారు. అలాగే మండలాలు, రెవిన్యూ డివిజన్లకు సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విషయాలను అసెంబ్లీ ముందు ఉంచుతామన్నారు. ఆ తర్వాత డ్యామ్ సేఫ్టీ నివేదిక, సూచనల ప్రకారం ముందుకెళ్తామన్నారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ నిర్వహణ, మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత రవాణా కల్పించిన తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడంతో నిర్వహణకు సంబంధించి నష్టాలు తగ్గిపోయాయి అని వ్యాఖ్యానించారు. అలాగే కుల గణనకు సంబంధించి కూడా స్పందించారు. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో ముగుస్తుండటంతో.. త్వరలోనే కొతత్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత కులగణన జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి మొత్తం రాష్ట్రానికి ఉన్న రుణాలు, వాటి వడ్డీలు తగ్గిచడంపై ఉంది అన్నారు. రాష్ట్రం ప్రస్తుతం రూ.7 లక్షల కోట్లు అప్పు ఉంది అన్నారు. నెల నెలా.. రూ.7 వేల కోట్లు కడుతున్నట్లు తెలిపారు. అప్పులపై వడ్డీ ఒక్క శాతం తగ్గినా కూడా నెలకు రూ.700 కోట్లు తగ్గుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రుణభారం తగ్గించుకునే పనిలో ఉన్నామని తెలిపారు.