iDreamPost
android-app
ios-app

Revanth Reddy: సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులపై CM రేవంత్ రెడ్డి కీలక సూచనలు.. ఇక నో టెన్షన్!

జూన్ రెండో వారం నుంచి నైరుతి రుతపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఇక ఈ బుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు కీలక సూచనలు చేశారు.

జూన్ రెండో వారం నుంచి నైరుతి రుతపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఇక ఈ బుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు కీలక సూచనలు చేశారు.

Revanth Reddy: సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులపై  CM రేవంత్ రెడ్డి కీలక సూచనలు.. ఇక నో టెన్షన్!

ఇటీవల కొద్ది రోజుల నుంచి హైదారాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానాలు కురిశాయి. ఇలా భారీ వర్షాలు కురిసిన సమయంలో  చాలా ప్రాంతాలుల జలమయ్యం అవుతుంటాయి. ఇక ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షం పడితే ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యల గురించి ఎంత చెప్పిన తక్కువే. అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వానల సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది.  అలానే రానున్న రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు కీలక సూచనలు చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీరనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

జూన్ రెండో వారం నుంచి నైరుతి రుతపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఇక ఈ బుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరమైన హైదరాబాద్ లో వాన కురిస్తే..ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హైదరాబాద్ నగరంతో పాటు సికింద్రబాద్ ప్రాంతంలో కూడా వానలు పడితే చాలు రోడ్లు మొత్తం జలమయం అవుతాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అందుకే వానలు పడిన ప్రతిసారీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

ఈ నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, పొన్నం, శ్రీధర్‌బాబులతో కూడా సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచలను చేశారు. వానలు పడే సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కు సంబంధించిన సమాచారం అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

ఈ వానాకాలంలో ట్రాఫిక్‌ సమస్యలతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో అవి ఆగకుండా చర్యలపై పలు సూచనలు చేశారు. ఇదే సమయంలో సిబ్బంది కొరత ఉంటే హోం గార్డులను వెంటనే రిక్రూట్‌ చేసుకోవాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని సీఎం తెలిపారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్‌కు కనెక్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నగరంలో వరద తీవ్రత ఉండే 141 ప్రాంతాలను గుర్తించినట్టు అధికారులు వివరించారు. అయితేఆ ప్రాంతాల్లో వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.