iDreamPost
android-app
ios-app

పోలింగ్ రోజు ఉద్యోగులకు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు!

Telangana CEO Vikas Raj Press Meet: మే 13న రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

Telangana CEO Vikas Raj Press Meet: మే 13న రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

పోలింగ్ రోజు ఉద్యోగులకు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు!

హైదరాబాద్ మహా నగరం దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ.. ఓట్ల పండగకు సొంతూరు పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయాయి. దాదాపుగా అంతా శనివారం రాత్రికే స్టార్ట్ అయ్యి వెళ్లిపోయారు. ఇంకా కొంతమంది ఆదివారం ప్రయాణం అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పోలింగ్ రోజు సొంతూరు వెళ్లి ఓటు వేసేందుకు అందరు ఉద్యోగులకు ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. ఆరోజు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

మే 13న తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ రోజు పౌరులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రోజు సొంతూరికి వెళ్లి ఓటేసేందుకు ప్రైవేటు ఉద్యోగులకు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. పోలింగ్ రోజు అన్నీ కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందే. అలా గనుక నిబంధనలు పాటించకపోతే మాత్రం ఆయా సంస్థలపై తప్పకుండా చర్యలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది మరింత నిఘా పెరుగుతుందని వెల్లడించారు. ఎవరు ఆదేశాలను కచ్చితంగా పాటించకపోయినా.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర బలగాలు మాత్రమే కాకుండా.. రాష్ట్రానికి చెందిన 60 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ తనిఖీలకు సంబంధంచి మొత్తం 8 వేలకు పైగా కేసులు నమోదు చేసిన విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 1.88 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పూర్తి నిఘా ఉంటుందని.. నిబంధనలు పాటించకపోతే మాత్రం వారిపై తప్పకుండా కఠిన చరయ్లు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యానించారు. ఓటు కలిగిన వారంతా తమప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.