Tirupathi Rao
TS Cabinet Decisions: తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏపీ తరహా వారందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
TS Cabinet Decisions: తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏపీ తరహా వారందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Tirupathi Rao
తెలంగాణలో రేవంత్ సర్కారు తమదైన నిర్ణయాలతో దూసుకుపోతోంది. తాజాగా జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదిరిగానే 2008 డీఎస్సీలో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2008 మొత్తం 3500 ఎస్జీటీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పరీక్షలో అర్హత సాధించినా అప్పుడు వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. అప్పుడు అర్హత సాధించిన అభ్యర్థులు అంతా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతో 2008లో అర్హత సాధించిన అందరికీ దాదాపు 15 ఏళ్ల తర్వాత ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు దక్కనున్నాయి.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరూ అనుకున్నట్లుగానే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం దక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమదైన మార్క్ పాలనతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మరిన్ని నిర్ణయాలతో ప్రజలకు మరింత చేరువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేబినెట్ సమావేశంలో మొత్తం 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం దక్కింది. అలాగే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి రాజ్ భవన్ కు పంపాలనే నిర్ణయానికి ఆమోదం దక్కింది.
మరోవైపు తెల్ల రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కూడా కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి నిర్ణయం వెలువడుతుంది అంటున్నారు. అలాగే ఉద్యోగుల సమస్యలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ ఉండగా.. వాటిలో రెండు డీఏలు విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధరణి కమిటీకి సంబంధించిన నివేదికలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరినట్లు చెప్తున్నారు. ఆ నివేదికలపై సిట్ కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది.
ఇవి మాత్రమే కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగమైన కల్యాణి లక్ష్మి పథకం కింద మహిళలకు తులం బంగారం, మహిళలకు రూ.2,500 నగదు, మహిళా సంఘాలకు వడ్డీలేకుండా రుణాలు మంజూరు చేయడం వంటి అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటి అమలుకు సంబంధించి పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే సభలో కీలక ప్రకటనలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని మరింతగా ప్రజల్లో తీసుకెళ్లాలని, తాము చేస్తున్న మంచిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మరి.. కేబినెట్ సమావేశంలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.