BRS ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?

BRS MLA High Court Notices: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

BRS MLA High Court Notices: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఈ పథకాలకు ఆకర్షితులైన ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఈసారి ఎలాగైన అత్యధిక సీట్లు సంపాదించి తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి హై కోర్టు నోటీజులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన విజయుడు విజయం సాధించాడు. అయితే విజయుడి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ అభ్యర్థి ఆర్ ప్రసన్న కుమార్ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టి.. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ప్రసన్న కుమార్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఉడవ్ల మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలో ఫీల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న విజయుడు తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని తెలిపారు.

ఎన్నికల సమయంలో రాజీనామా లేఖను.. దానికి లభించిన ఆమోదం తదితర అధారాలు సమర్పిచలేదని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నిబంధనల ప్రకారం నామినేషన్ కు 3 నెలల ముందు రాజీనామా సమర్పించాల్సి ఉందని అన్నారు. కానీ విజయుడి విషయంలో ఇలాంటిది జరగలేదని అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి విజయుడి ఎన్నికపై పూర్తి వివరాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తూ.. విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి ప్రసన్న కుమార్ ఎన్నికల ముందు ఈ పిటీషన్ దాఖలు చేసినా.. ఎన్నికల నోటిఫికేషన్ లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

Show comments