iDreamPost

ఖాతాదారులను మోసం చేసిన సబ్ పోస్ట్‌మాస్టర్ .. ఏకంగా కోటిన్నర హాంఫట్!

తెలంగాణలోని ఓ జిల్లాలో సబ్ పోస్ట్ మాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. కస్టమర్లను నమ్మించి బురిడీ కొట్టించాడు. ఏకంగా రూ. కోటిన్నరకు పైగా అవకతవకలకు పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు.

తెలంగాణలోని ఓ జిల్లాలో సబ్ పోస్ట్ మాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. కస్టమర్లను నమ్మించి బురిడీ కొట్టించాడు. ఏకంగా రూ. కోటిన్నరకు పైగా అవకతవకలకు పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు.

ఖాతాదారులను మోసం చేసిన సబ్ పోస్ట్‌మాస్టర్ .. ఏకంగా కోటిన్నర హాంఫట్!

మనిషికి ఉన్న అతి పెద్ద జబ్బు వ్యసనం. ఆ వ్యసనామే ప్రస్తుత కాలంలో.. చాలమంది మద్యం, జూదం బారినపడి బానిసలుగా తయారవుతున్నారు. ఈ క్రమంలోనే నేటి యువత ఎక్కువగా ఆన్ లైన్ బెట్టింగ్స్ అనే ఊబిలో ప్రాణాలను పోగొట్టు కోవడం తరుచుగా చూస్తూన్నాం. ముఖ్యంగా.. పబ్జీ, ఆన్ లైన్ రమ్మీ, క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పెడతోవ పట్టిస్తున్నాయి. వీటి కోసం వేలకి వేలు డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం, మోసపోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాగా, ప్రభుత్వం ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధించినప్పటికి పలువురు యువత వీటి నుంచి బయట పడడం లేదు. ఇంకా వీటిలో చిక్కుకొని అప్పులు పాలవుతున్నారు. తాజాగా ఈ ఆన్ లైన్ బెట్టింగులకు, జల్సాలకు అలవాటు పడ్డా ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. చేసిన పనికి అధికారులు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. తాను పనిచేస్తున్న శాఖలోనే ధుర్వినియోగ పనులకు పాల్పడ్డాడు. ఒకపక్క కుటుంబం అప్పుల పాలైంది. మరోపక్క ఇతడు జల్సాలకు ఆన్ లైన్ బెట్టింగ్స్ కు అలవాటు పడ్డాడు. ఇంతలోనే ప్రజాధనంపై కన్నేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకాంగా కోటి రూపాయలను స్వాహా చేశాడు. అసలు ఏం జరిగిదంటే.. నల్గొండ జిల్లా హాలియా మండలంలో.. హజారి గూడెంకు చెందిన పెరుమళ్ల రామకృష్ణ ఒక నేషనల్ చెస్ ఛాంపియన్. ఇతను నాలుగేళ్ల క్రితం స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర తపాలా శాఖలో సబ్ పోస్ట్ మాస్టర్ గా ఉద్యోగం సాధించాడు.

కాగా, వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన రామకృష్ణకు రెండేళ్ళ క్రితం.. నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో సబ్ పోస్ట్ మాస్టర్‌గా బదిలీ పై వచ్చాడు. ఈ క్రమంలోనే.. రామకృష్ణ ఆన్ లైన్, బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడి అప్పులు చేశాడు. ఇక ఈ అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఖాతాదారులు దాచుకునే సొమ్మును అతని సొంతానికి వాడుకున్నాడు. దీనితో పాటు ఆర్డీ (రికరింగ్ డిపాజిట్లు) కట్టే డబ్బులు , ఖాతాదారుల పాసు పుస్తకాలను కూడా ఆన్ లైన్ లో నమోదు చేయలేదు. అయితే ఖాతాదారులుకు మాత్రం కంప్యూటర్ పనిచేయడం లేదని, తర్వాత రాసి ఇస్తానని చెబుతూ వచ్చాడు. అతడి పై నమ్మకంతో.. ఖాతాదారులు కూడా సరేనని ఊరుకున్నారు.

అయితే కొద్ది రోజులుగా రామకృష్ణ సెలవులో ఉన్నాడు. దీంతో.. హిల్ కాలనీలో పనిచేస్తున్న మరో సబ్ పోస్ట్ మాస్టర్ రంగయ్య ఇన్ చార్జిగా వచ్చారు. కాగా, ఖాతాదారులు పోస్టాఫీసులో తాము జమచేసిన నగదు, ఖాతాలో ఉన్న నగదులో చాలా తేడా ఉందని రంగయ్యకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దేవరకొండ పోస్టల్ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ పోస్టాఫీసు రికార్డులను పరిశీలించడంతో.. రామకృష్ణ చేసిన అవినీతి వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల విచారణలో అతడే ఈ అవినీతికి పాల్పడినట్టు తేలడంతో రామకృష్ణ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. విచారణ కొనసాగుతోందని, దాదాపు కోటి రూపాయల పైనే అవకతవకలు జరిగిఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఖాతా దారుల సొమ్ముకు తపాలాశాఖ పూర్తి బాధ్యత వహిస్తుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. విచారణ అనంతరం సదరు సబ్ పోస్ట్ మాస్టర్ వద్ద నుంచి కాజేసిన సొమ్మును రికవరీ చేస్తామని పోస్టల్ అధికారులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి