Arjun Suravaram
Shashikala Reddy: పిల్లలకు తల్లిదండ్రులు జన్మనిస్తారు. కానీ ఆ పిల్లలకు ఉన్నత విద్యనందించి సమాజంలో గొప్ప పొజీషన్ కి చేరేలా చేసేది గురువులు. తాము అభిమానించే గురువు ఇక రాడని తెలిసి విద్యార్థులు పడ్డ ఆవేదన చూసి అక్కడ టీచర్లు సైతం ఎమోషనల్ అయ్యారు.
Shashikala Reddy: పిల్లలకు తల్లిదండ్రులు జన్మనిస్తారు. కానీ ఆ పిల్లలకు ఉన్నత విద్యనందించి సమాజంలో గొప్ప పొజీషన్ కి చేరేలా చేసేది గురువులు. తాము అభిమానించే గురువు ఇక రాడని తెలిసి విద్యార్థులు పడ్డ ఆవేదన చూసి అక్కడ టీచర్లు సైతం ఎమోషనల్ అయ్యారు.
Arjun Suravaram
సమాజంలో గురువుకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశానికి మంచి పౌరులను అందించే వ్యక్తి గురువు. తాను నిత్య విద్యార్థిగా ఉంటూ.. విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తుంటారు. కేవలం జీవనం కోసం ఉపయోగపడే పాఠాలే కాకుండా జీవితంలో పైకి వచ్చే మంచి నడవడికను టీచర్లు నేర్పిస్తుంటారు. అంతేకాక ఎంతో నిజాయితీగా పని చేస్తూ పిల్లల అభివృద్ధి కోసం పరితపిస్తుంటారు. విద్యార్థులపై అప్యాయత చూపే గురువులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు పదవి విరమణ చేసిన, వేరే చోటికి బదిలీ అయినా విద్యార్థులు అల్లాడిపోతారు. తమ గురువుకి వెరైటీగా వీడ్కోలు పలుకుతుంటారు. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో ఉస్మానియా మెడికల్ కాలేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడి నుంచి ఎంతో మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవలు చేస్తున్నారు. ఈ ఉస్మానియ వైద్య కళశాలకు ప్రిన్సిపల్ గా డాక్టర్ పి. శశికళా రెడ్డి ఉన్నారు. కాలేజీ అభివృద్ధి కోసం ఆమె ఎంతో కృషి చేశారు. అంతేకాక విద్యార్థుల అభివృద్ధి కోసం పరితపించే వారు. అలా వైద్య విద్యార్థుల మనస్సులో డాక్టర్ శశికళా రెడ్డి ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే ఆమె తాజాగా వాలంటీర రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇది ఆ విద్యార్థులకు ఎంతో బాధకు గురి చేసింది. అయితే తమ మేడమ్ ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని భావించారు. మేడమ్ పై తమకు ఉన్న అభిమానం జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని భావించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఓ గుర్రపు బండిని ఏర్పాటు చేశారు. దానిని చక్కగా పూలతో అలంకరించారు.
అనంతరం డాక్టర్ శశికళా రెడ్డిని గుర్రపు బండిపై ర్యాలీగా విద్యార్థులు తీసుకెళ్లారు. “థ్యాంక్యూ మేడమ్” అంటూ బ్యాండ్ బాజాలతో విద్యార్థులు వీడ్కోలు పలికారు. మెడికల్ అభివృద్ధికి శశికళా ఎంతో కృషి చేశారని విద్యార్థులు తెలిపారు. తోటి లెక్చర్స్ పట్ల ఆమె చూపే అభిమానం, విద్యార్థులపై చూపే ప్రేమకు నిదర్శనే ఈ ఘనమైన వీడ్కోలను అక్కడి వారు అంటున్నారు. కాలేజీ లో అనేక అభివృద్ధి పనులకు ఆమె కృషి చేశారు. తనకు ఎంతో గొప్పగా వీడ్కోలు చెప్పిన విద్యార్థులు, కాలేజీ బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక గుర్రపు బండి పై నుంచి విద్యార్థులకు అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు. విద్యార్థులు అందించిన ఈ ఘన వీడ్కోలుకి ఆమె ఎమోషనలయ్యారు. మరి.. తమ ప్రిన్సిపల్ కి విద్యార్థులు అందించిన ఈ అద్భుతమైన వీడ్కోలు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.