వీడియో: మాజీ మంత్రి ఆఫీస్ నుంచి ఫర్నిచర్ తరలింపు!

మంత్రుల పేషీల నుంచి చిన్న కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీలులేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి చాంబర్ నుంచి ఫర్నిచర్ తరలించే వైనం వెలుగు చూసింది.

మంత్రుల పేషీల నుంచి చిన్న కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీలులేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి చాంబర్ నుంచి ఫర్నిచర్ తరలించే వైనం వెలుగు చూసింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నూతన ముఖ్యమంత్రిగా  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు తమ నివాసలను ఖాళీ చేస్తున్నారు. మంత్రుల పేషీల నుంచి చిన్న కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీలులేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశిలిచ్చారు. ఆమె  ఆదేశాలిచ్చి 24 గంటల్లోపే రవీంద్రభారతి ప్రాంగణలో బుధవారం మాజీ మంత్రి శ్రీనివాస్  గౌడ్ పేషీ నుంచి ఫర్నిచర్ తరలిస్తున్నారు.  నెంబర్ ప్లేట్ లేని వాహనంలో ఆ ఫర్నిచర్ ను తరలించే ప్రయత్నం చేశారు.

రవీంద్రభారతిలో ప్రాంతంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చాంబర్‌ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో తన చాంబర్ ను శ్రీనివాస్ గౌడ్ ఖాలీ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంత్రి కార్యాలయం నుంచి కొందరు ఫర్నిచర్‌ను తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కొంతమంది వ్యక్తులు చాంబర్ లోని  ఫర్నిచర్, ఇతర సామాన్లను తీసుకువెళుతుండగా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తులకు, ఓయూ జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

రవీంద్ర భారతికి వచ్చిన ఓయూ గిరిజిన శక్తి  అధ్యక్షుడు శరత్, ఇతర నాయకులు అక్కడి వ్యక్తులను ప్రశ్నించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పిన మాట ప్రకారం గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యాలయానికి తీసుకెళ్తున్నామని సుధీర్ అనే వ్యక్తి సమాధానం ఇచ్చారు. అయితే సీఎస్ ఆదేశాలకు భిన్నంగా ఎలా చేస్తారంటూ షిఫ్టింగ్ ను అడుకున్నారు. దీంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనపై టీజీఓ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ కార్యాలయంలో వినియోగించుకునేందుకు ఆ ఫర్నిచర్‌ను తీసుకువెళ్లాలనుకున్నామని, అయితే అది ప్రభుత్వానిదని తెలియడంతో ఆ ప్రయత్నం విరమించామని వారు తెలిపారు.

ఇక ఈ రోజు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం జరిగింది. అనంతరం రజనీ అనే వికలాంగురాలికి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. ఉద్యోగం ఇచ్చారు. అంతేకాక ఆరు గ్యారెంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఇక రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. మరి.. ఫర్నిచర్ తరలింపు విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments