iDreamPost

ప్రతిభకు దక్కిన ఫలితం.. HCU విద్యార్థినికి 47 లక్షల వార్షిక వేతనం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని క్యాంపస్ ప్లేస్ మెంట్లలో జాక్ పాట్ కొట్టింది.. ఏకంగా 47 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువతి.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని క్యాంపస్ ప్లేస్ మెంట్లలో జాక్ పాట్ కొట్టింది.. ఏకంగా 47 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువతి.

ప్రతిభకు దక్కిన ఫలితం.. HCU విద్యార్థినికి 47 లక్షల వార్షిక వేతనం

చేసే పనిపట్ల శ్రద్ధ, అంకితభావం ఉంటే విజయం సాధించడం కష్టమేమీ కాదని నిరూపిస్తున్నారు నేటి యువత. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాలను నిజం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నేటి కాలం యువతీయువకులు. తాము కన్న కలల్ని నిజం చేసుకునేందుకు అహర్నిషలు కష్టపడి చదువుతూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలువురు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో రికార్డ్ స్థాయి వేతనాలను అందుకున్న విషయం తెలిసిందే. చదువు పూర్తి కాకుండానే లక్షల్లో ప్యాకేజీలను అందుకొని సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని 47 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడమే కష్టమవుతున్న తరుణంలో హెచ్ సీయూ విద్యార్ధిని రికార్డు స్థాయి వేతనంతో ఉద్యోగం పొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి ఎంపికై యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్లలో చిన్మయి అనే ఎంటెక్ విద్యార్థిని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి ఎంపికైనట్టు వర్సిటీ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

హెచ్ సీయూలో ‘సర్వీస్‌ నౌ’ సాఫ్ట్‌వేర్‌ సంస్థ క్యాంపస్ ప్లేస్ మెంట్లలో ఉద్యోగాలు కల్పించింది. ఇందులో ఎంటెక్‌ (స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌ విభాగం) విద్యార్థిని చిన్మయి మహాపాత్రో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి ఎంపికైంది. ‘సర్వీస్‌ నౌ’ సాఫ్ట్‌వేర్‌ సంస్థ రూ.47 లక్షల వార్షిక వేతనంతో చిన్మయిని ఎంపిక చేసిందని వర్సిటీ అధికారులు తెలిపారు. భారీ వేతనంతో కూడిన ఉద్యోగానికి ఎంపికైన చిన్మయిని వీసీ ప్రొఫెసర్‌ బీజే రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తన ఎంపికకు దోహదపడిన అధ్యాపకులకు చిన్మయి కృతజ్ఞతలు తెలిపారు. 47 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైన చిన్మయిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి