P Venkatesh
సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అందించింది. మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపనున్నట్లు ప్రకటించింది.
సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అందించింది. మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపనున్నట్లు ప్రకటించింది.
P Venkatesh
తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ సంక్రాంతి. మూడు రోజులపాటు జరిగే ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. ఇంటిల్లిపాది ఆనందంగా గడిపేందుకు ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్చలో ఏపీ, తెలంగాణకు వెళ్లే వారు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతుంటాయి. కాగా సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అందించింది. మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపనున్నట్లు ప్రకటించింది.
పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా, రద్దీ కొనసాగుతుండడంతో తాజాగా మరో నాలుగు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. సికింద్రాబాద్-నర్సాపూర్, నర్సాపూర్ – సికింద్రాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్ – హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. సికింద్రాబాద్ – నర్సాపూర్ (07176) ప్రత్యేక ఈ నెల 13న రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.
మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. నర్సాపూర్ – హైదరాబాద్ (07177) స్పెషల్ ట్రైన్ ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. హైదరాబాద్-శ్రీకాకుళం (07178) ప్రత్యేక రైలు ఈ నెల 12న రాత్రి 9.10 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు 11.45 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. శ్రీకాకుళం రోడ్ – హైదరాబాద్ (07179) ప్రత్యేక రైలు 13న సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు నాంపల్లికి వస్తుంది.
తిరుపతి – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07055) జనవరి 10వ తేదీన రాత్రి 8.25గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.10గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది.
సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ రైలు (07056) జనవరి 11వ తేదీన రాత్రి 7గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 6.45గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే, కాకినాడ టౌన్ -సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07057) 12వ తేదీ రాత్రి 9గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు సికింద్రాబాద్ చేసుకోనుంది.
సికింద్రాబాద్- కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07071) జనవరి 13వ తేదీన రాత్రి 9గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్ – తిరుపతి ప్రత్యేక రైలు (07072) జవనరి 14న ఉదయం 10గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.20గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి -కాచిగూడ ప్రత్యేక రైలు (02707) జనవరి 15న తెల్లవారుజామున 5.30గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.
ప్రత్యేక రైలు నెం.07021 జనవరి 11న రాత్రి 09 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.00 గం.లకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. అలాగే కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నెం.07022 జనవరి 12వ తేదీన సాయంత్రం 05.40 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.55 గం.లకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే ప్రత్యేక రైలు నెం.07023 జనవరి 12న సాయంత్రం 06.30 గం.లకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గం.లకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నెం. 07024 జనవరి 13న రాత్రి 10.00 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ట్రైన్ నెంబర్ 07089 సికింద్రాబాద్- బ్రహ్మపుర్ – జనవరి 7, 14 తేదీలు
ట్రైన్ నెంబర్ 07090 బ్రహ్మపుర్ – వికారాబాద్ – జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07091 వికారాబాద్- బ్రహ్మపుర్ – జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07092 బ్రహ్మపుర్ – సికింద్రాబాద్ – జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 08541 విశాఖ – కర్నూలు సిటీ – జనవరి 10, 17, 24 తేదీలు
ట్రైన్ నెంబర్ 08542 కర్నూలు సిటీ – విశాఖ – జనవరి 11, 18, 25 తేదీలు
ట్రైన్ నెంబర్ 08547 శ్రీకాకుళం – వికారాబాద్ – జనవరి 12, 19, 26 తేదీలు
ట్రైన్ నెంబర్ 08548 వికారాబాద్ – శ్రీకాకుళం – జనవరి 13, 20, 27 తేదీలు
ట్రైన్ నెంబర్ 02764 సికింద్రాబాద్ – తిరుపతి – జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 02763 తిరుపతి – సికింద్రాబాద్ – జనవరి 11, 18 తేదీలు
ట్రైన్ నెంబర్ 07271 సికింద్రాబాద్ – కాకినాడ – జనవరి 12 తేదీ
ట్రైన్ నెంబర్ 07272 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ – జనవరి 13 తేదీ
ట్రైన్ నెంబర్ 07093 సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ – జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07094 బ్రహ్మపూర్ – సికింద్రాబాద్ – జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07251 నర్సాపూర్ – సికింద్రాబాద్ – జనవరి 10 తేదీ
ట్రైన్ నెంబర్ 07052 సికింద్రాబాద్ – నర్సాపూర్ – జనవరి 11 తేదీ
Railways will run special trains between various destinations @drmvijayawada @RailMinIndia pic.twitter.com/oTUOl6iYj7
— South Central Railway (@SCRailwayIndia) January 11, 2024