iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి KTR ట్వీట్.. కర్ణాటక CM సీరియస్!

Siddaramaiah Vs KTR: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతోంది. ఈనేపథ్యంలోనే కేటీఆర్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది.

Siddaramaiah Vs KTR: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతోంది. ఈనేపథ్యంలోనే కేటీఆర్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది.

మాజీ మంత్రి KTR ట్వీట్.. కర్ణాటక CM సీరియస్!

ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల బీఆర్ఎస్ ఓడిపోగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత మూడు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే వారి కౌంటర్లకు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. తాజాగా కేటీఆర్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భారతీయ రాష్ట్ర సమితీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్  చేసిన ఓ ట్వీట్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కేటీఆర్ చేసిన ట్వీట్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. అంతేకాక అదే స్థాయిలో తిరిగి కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడిన ఓ వీడియోను కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో..’ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా ? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు’ అంటూ కర్నాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడినట్లు ఉంది. ఆ వీడియోను కేటీఆర్  ఎక్స్ వేదికగా షేర్ చేసి.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారు. అలా  వాగ్దానాలు ఇచ్చే ముందు ఆలోచన, ప్లాన్ చేయరా?. తెలంగాణ భవిష్యత్ కూడా ఇలాగే ఉంటుందా?  అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. అంతేకాక బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ట్విట్టర్ లో ఓ రేంజ్ లో వార్ జరుగుతోంది. కేటీఆర్ చేసిన ట్వీట్ కర్ణాటక సీఎంకు  చేరింది. దీంతో సిద్ధరామయ్య.. కేటీఆర్ ట్వీట్ పై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియదని, అందుకే వారి పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని సీఎం సిద్ధు దుయ్యబట్టారు. కర్ణాటక బీజేపీ వాళ్లు ఎడిట్ చేసిన వీడియోలను షేర్ చేస్తున్నారని కేటీఆర్ పై మండిపడ్డారు.

మిస్టర్ కేటీఆర్ తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? అంటూ సిద్దరామయ్య ప్రశ్నించారు.అంతేకాక ఎందుకు ఓడిపోయారు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మీకు ఏది ఫేక్.. ఏది ఎడిట్ చేసినది.. ఏది నిజమో తెలియదని, బీజేపీ క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ బీజేపీకి ఫర్‌ఫెక్ట్ బీ టీమ్ అని సిద్ధరామయ్య స్ట్రాంగ్  రిప్లయ్ ఇచ్చారు. గతంలో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫాక్స్ కాన్ కంపెనీ బెంగళూరు తరలిపోతుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో కంపెనీ ప్రతినిధికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే లేఖ రాశారంటూ ఓ ఫేక్ లేఖ నెట్టింట్లో  చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు ఆ లేఖ ఫేక్ అని తేల్చారు. తాజాగా కర్ణాటక సీఎంకు సంబంధించిన వీడియోను కేటీఆర్ పోస్టు చేయగా.. ఫేక్ న్యూస్‌లను సర్క్యూలేట్ చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. మరి.. కేటీఆర్, సిద్ధరామయ్య మధ్య జరిగిన ట్విట్టర్ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.