iDreamPost
android-app
ios-app

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఈ రూట్లలో వెళ్తే పండగ తర్వాతే ఇంటికి

  • Published Jan 13, 2024 | 11:43 AMUpdated Jan 13, 2024 | 11:43 AM

సంక్రాంతికి ఊరేళ్ల వారితో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఊరేళ్లే వారితో టోల్‌ రోడ్ల మీద ఫుల్‌ ట్రాఫిక్‌ ఏర్పడింది.

సంక్రాంతికి ఊరేళ్ల వారితో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఊరేళ్లే వారితో టోల్‌ రోడ్ల మీద ఫుల్‌ ట్రాఫిక్‌ ఏర్పడింది.

  • Published Jan 13, 2024 | 11:43 AMUpdated Jan 13, 2024 | 11:43 AM
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఈ రూట్లలో వెళ్తే పండగ తర్వాతే ఇంటికి

రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో వెల్లి విరుస్తున్నాయి. ఉపాధి కోసమో, ఉద్యోగాల నిమిత్తమో సొంత ఊరిని, అయిన వాళ్లని విడిచి.. ఎక్కడెక్కడో ఉంటున్న వారు సంక్రాంతి పండగకి మాత్రం.. సొంత ఊరికి చేరుకుంటారు. తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లతో కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటారు. ఏడాదికి సరిపడా జ్ఞాపకాలను మిగుల్చుకుని తిరుగు ప్రయాణం అవుతారు. సంక్రాంతి సందర్భంగా బస్సుల్లో, రైళ్లలో రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కొందరు.. పండగకు రెండు, మూడు నెలల ముందే టికెట్లు బుక్‌ చేసుకుంటారు. సంక్రాంతికి ఊరేళ్లే వారితో రోడ్లు, టోల్‌ ప్లాజాల వద్ద భారీ రద్దీ ఉంటుంది.

సంక్రాంతి సందర్భంగా భాగ్యనగరంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ వాసులు సొంత ఊర్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దాంతో.. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లన్ని రెండ్రోజులుగా ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నాయి. రైల్వేల్లో ముందుస్తు రిజర్వేషన్లు కూడా దొరకటం లేదు. పైగా తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ కావడంతో చాలా మంది ఆడవాళ్లు.. బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రైవేటు బస్సుల్లోనూ రద్దీ విపరీతంగా పెరిగింది. కొందరు సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్దామని అనుకున్నా.. వారికి కూడా తిప్పలు తప్పటం లేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు టోల్‌ప్లాజాల వద్ద కూడా ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది

heavy traffic in that routes

సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు, ఏపీకి వెళ్లే నగరవాసుల వాహనాలు కిలో మీటర్ల మేర బారులు దీరాయి. ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కిలో మీటర్ల మేర వాహనాలు క్యూలో నిల్చున్నాయి. చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఫాస్టాగ్ ఉన్నా.. కూడా టోల్ ప్లాజా వద్ద వాహనాలు వేగంగా ముందుకు కదలటం లేదు. దానికి తోడు ఉదయం పొగమంచు కూడా కమ్మేయటంతో వెహికల్స్‌ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పండుగ నేపథ్యంలో శుక్రవారం రాత్రి వరకు 50 వేల వాహనాలు వెళ్లనున్నట్టు జీఎంఆర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా.. కిలోమీటర్ల మేర వాహనాలు పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరాయి. దాదాపు ఏపీకి వెళ్లేవరకు ఈ రద్దీ ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉంది. రహదారిపై రద్దీలో చిక్కుకున్న పలువురు వాహనదారులు ఇలా వెళ్తే.. పండగ తర్వాత ఇంటికి చేరుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి