iDreamPost
android-app
ios-app

తెలంగాణలో దూకుడు పెంచిన అధికారులు…ఈ సారి ఏకంగా స్కూల్ బస్సులు!

RTO School Buses: ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాలను నివారించేందుకు పలు విభాగాల్లో తనిఖీలు చేపట్టింది. తాజాగా స్కూల్ బస్సులపై దాడులు చేసింది.

RTO School Buses: ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాలను నివారించేందుకు పలు విభాగాల్లో తనిఖీలు చేపట్టింది. తాజాగా స్కూల్ బస్సులపై దాడులు చేసింది.

తెలంగాణలో దూకుడు పెంచిన అధికారులు…ఈ సారి ఏకంగా స్కూల్ బస్సులు!

ఇటీవలకాలం తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాలను నివారించేందుకు పలు విభాగాల్లో తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే ఫుడ్, ఆర్టీఏ విషయంలో అధికారులు దాడులు చేశారు. ప్రముఖ రెస్టారెంట్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టి అధికారులు అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. అలానే ఆర్టీఏలో జరుగుతున్న అవినీతి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే విధంగా నకిలీ డాక్టర్ల ను ఏరివేశారు తెలంగాణ వైద్య మండలి అధికారులు. ఇక ఈ సారి ఏకంగా ప్రైవేటు స్కూల్ బస్సులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. భారీగా స్కూల్ బస్సులను సీజ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రోడ్డు రోడ్డు రవాణా శాఖ అధికారులు ప్రైవేటు స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. ఫిట్ నెస్, సరైన అనుమతి పత్రాలు లేని స్కూల్ బస్సులను ఎక్కడికక్కడ పట్టుకుని సీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర ఆధ్వర్యంలో జూన్ 13 గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలోనే సరైన పత్రాలు లేని బస్సులను అధికారులు సీజ్ చేశారు. మొత్తంగా అధికారులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 86 బస్సులను సీజ్ చేశారు.

Massive school bus seizure! 01

ఇక ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన ప్రైవేటు స్కూల్ బస్సులో హైదరాబాద్ జిల్లాకు చెందినవి 25 ఉన్నాయి. అలానే నగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాకు చెందిన  46, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాకు చెందినవి 15 బస్సులను అధికారులు సీజన్ చేశారు. ఇక ఏకకాలంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో స్కూల్ బస్సులకు  సంబంధించిన అనేక లోపలు బయటపడ్డాయి. చాలా బస్సులు రోడ్డెక్కడానికి ఫిట్నెస్ లేనివని, కొన్నింటికి అవసరమైన లైసెన్సులు లేవని, టాక్సీ చెల్లించనివి కూడా పలు బస్సులు ఉన్నాయని ఆర్టీఏ అధికారులు గుర్తించారు.

తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు వేసవి సెలవులు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలోనే అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. పిల్లలు రక్షణ ముఖ్యమని ఈ నేపథ్యంలోనే సరిగ్గా లేని బస్సులను  సీజ్ చేశామని అధికారులు తెలిపారు. జూన్ 11న రవాణా అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంలో సరైన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా స్కూల్ బస్సులను రోడ్ల మీదకు రానివ్వకూడదని మంత్రి సూచించారు. వాహనదారులకు, ప్రజలకు అన్ని విషయాలను తెలియజేసేందుకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా ఈ మధ్యకాలంలో అవినీతి, అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే ఆర్టీఏ, ఫుడ్, వైద్యం వంటి అంశాలకు సంబంధించిన వాటిపై తనిఖీలు నిర్వహించి..భారీ మోసాలను కనిపెట్టారు.