iDreamPost
android-app
ios-app

HYD మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి కొత్త సేవలు!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మరింత ఈజీగా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. మెట్రో ప్రయాణికులకు ప్రయోజనం కలుగనున్నది.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మరింత ఈజీగా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. మెట్రో ప్రయాణికులకు ప్రయోజనం కలుగనున్నది.

HYD మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి కొత్త సేవలు!

హైదరాబాద్ మహానగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక ప్రయాణం కాస్త సులువైపోయింది. ట్రాఫిక్ సమస్య లేకుండా.. పొల్యూషన్ తో ఇబ్బంది పడకుండా ప్రయాణికులకు మెట్రో జర్నీ ఉపయోగకరంగా మారింది. ఆఫీసులకు వెళ్లేవారు, విద్యార్థులు, ఇతర పనులు చేసుకునే వారు మెట్రో ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. నిత్యం వేలాది మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటి వరకు మెట్రో ప్రయాణికులు కౌంటర్ లో టిక్కెట్ తీసుకోవడం లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్ లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకోవడం చేస్తుంటారు. ఇకపై మరింత ఈజీగా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.

దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ యూజ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు మీ మొబైల్ లోని వాట్సాప్ ద్వారా మెట్రో టిక్కెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేయొచ్చు. మెట్రో రైల్ టికెటింగ్ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు బిల్‌ఈజీ ఇ సొల్యూషన్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం వెల్లడించింది ప్రముఖ ఎంటర్ ప్రైజ్ కమ్యూనికేషన్ సంస్థ రూట్ మొబైల్. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో రూట్ మొబైల్ వాట్సాప్ ఆధారిత మెట్రో రైల్ టికెటింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. అందులో హైదరాబాద్, నాగ్‌పూర్, పూణె నగరాలు ఉన్నాయి.

మెట్రో రైలు టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ప్రయాణికులు మెట్రో అధికారిక వాట్సాప్ ఖాతాతో చాట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఏ స్టేషన్ నుంచి ఎక్కడి వరకు ప్రయాణించాలనుకుంటున్నారు, ఎన్ని టికెట్లు కావాలో నమోదు చేయాలి. అప్పుడు పే మెంట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మీరు టికెట్లకు సరిపడా నగదు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ ట్రాన్సాక్షన్ విజయవంతంగా పూర్తి కాగానే వాట్సాప్ లింక్ ద్వారా క్యూఆర్ కోడ్‌తో టికెట్లు లభిస్తాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూలైన్లలో వేచి చూడాల్సిన పని ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగనున్నది.