iDreamPost
android-app
ios-app

దారికాచిన మృత్యువు.. పాపకు చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళుతూ

  • Published Apr 25, 2024 | 1:10 PM Updated Updated Apr 25, 2024 | 1:10 PM

పాపకు చెవులు కుట్టిద్దామని ఎంతో సంతోషంగా బయలు దేరింది ఆ కుటుంబం. హైదరాబాద్ నుండి విజయవాడకు పది మంది కలిసి.. ఓ కారులో బయలు దేరారు. మార్గమధ్యంలో ఓ బంధువును ఎక్కించుకోవాల్సి ఉండగా. .

పాపకు చెవులు కుట్టిద్దామని ఎంతో సంతోషంగా బయలు దేరింది ఆ కుటుంబం. హైదరాబాద్ నుండి విజయవాడకు పది మంది కలిసి.. ఓ కారులో బయలు దేరారు. మార్గమధ్యంలో ఓ బంధువును ఎక్కించుకోవాల్సి ఉండగా. .

  • Published Apr 25, 2024 | 1:10 PMUpdated Apr 25, 2024 | 1:10 PM
దారికాచిన మృత్యువు.. పాపకు చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళుతూ

దేశంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్లు రక్తమోడుతున్నాయి. క్షణికంలో జరుగుతున్న ఈ యాక్సిండెట్ల వల్ల కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. ఒక్కోసారి అయితే కుటుంబాలను నామ రూపాలు లేకుండా చేస్తున్నాయి ఈ ప్రమాదాలు. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తిలో చెప్పినట్లు.. రోడ్డు ప్రమాదం అంటే కేవలం యాక్సిడెంట్ మాత్రమే కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడటం లాంటిది. అతివేగం, వాహనంపై నియంత్రణ లేకపోవడం, నిద్రలేమి, మద్యం సేవించి నడపడం వంటివి యాక్సిడెంట్లకు కారణాలు అవుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లో ఆరుగుర్ని బలితీసుకుంది రోడ్డు ప్రమాదం. పాపకు చెవులు కుట్టిద్దామని విజయవాడ కారులో బయలు దేరిన ఓ కుటుంబంలోని ఆరుగుర్ని మృత్యువు దారి కాచి బలి తీసుకుంది.

ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..సూర్యా పేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్‌కు కొన్నాళ్ల క్రితం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్ గోవిందాపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీకాంత్‌కు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. అత్తామామలతో కలిసి హైదరాబాద్‌లో జీవిస్తున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ చిన్న పాప లావణ్యకు విజయవాడ గుణదల మేరీమాత దేవాలయంలో చెవులు కుట్టించేందుకు గురువారం ఉదయం బయలు దేరారు. మొత్తం పది మంది కారులో ప్రయాణిస్తున్నారు.

చిమిర్యాలలోని మరో బంధువును ఎక్కించేందుకు వెళుతుండగా.. కోదాడ బైపాస్ వద్దకు చేరుకుంది కారు. ఈ క్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా, బలంగా ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో శ్రీకాంత్, పెద్ద కుమార్తె లాస్య, అత్తామామలు మాణిక్యమ్మ, చంద్రారావు, శ్రీకాంత్ బావ మరిది కృష్ణం రాజు, స్వర్ణ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో చిన్న కూతురు లావణ్య, నాగమణి, స్వర్ణ, కృష్ణం రాజు పిల్లలు.. కౌశిక్, కార్తీక్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు ఎదురు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. శ్రీకాంత్ భార్య నాగమణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş