iDreamPost
android-app
ios-app

Revanth Reddy: రేవంత్‌ సర్కార్‌ మరో శుభవార్త.. ప్రజలందరికీ ఫ్రీగా ఆ కార్డ్‌! లక్షల్లో లాభం!

  • Published Jul 02, 2024 | 2:37 PM Updated Updated Jul 02, 2024 | 2:37 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే అందరికి లక్షల లబ్ది చేకూర్చే కార్డులను ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే అందరికి లక్షల లబ్ది చేకూర్చే కార్డులను ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఆ వివరాలు..

  • Published Jul 02, 2024 | 2:37 PMUpdated Jul 02, 2024 | 2:37 PM
Revanth Reddy: రేవంత్‌ సర్కార్‌ మరో శుభవార్త.. ప్రజలందరికీ ఫ్రీగా ఆ కార్డ్‌! లక్షల్లో లాభం!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలతో పాటు.. ప్రజలకు మేలు చేసే అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటూ.. సంక్షేమ పాలన అందించే దిశగా సాగుతోంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌ సర్కార్‌.. ఆ మాట నిలబెట్టుకుంటుంది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని హామీల అమలుపై సంతకం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా వీలైనన్ని హామీలను అమలు చేశారు. మధ్యలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో కొన్నింటి అమలుకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ముగియడంతో మిగతా హామీల అమలకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. అందరికి ఉచితంగా లక్షలు లబ్ధి చేకూర్చే ఆ కార్డు ఇస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

తాజాగా రేవంత్‌ రెడ్డి.. వరంగల్‌లో పర్యటించారు. ఇక్కడ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రామానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకొచ్చారు. త్వరలోనే మరో కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తాము అన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అందరికి కార్డులు ఇస్తామని ప్రకటించారు.

ఇంతకు ఈ ప్రాజెక్ట్‌ ఏంటి.. ఏ కార్డులు అంటే.. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు ఇవ్వనున్నట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రజలందరికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులో ప్రతి పౌరుడి ఆరోగ్య సమస్యలు, బల్డ్‌ గ్రూప్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యలన్నింటిని ప్రస్తావిస్తామని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి దగ్గర ఈ ప్రొఫైల్‌ కార్డు ఉండాలని.. ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడితే.. ఈ కార్డు ఉంటే చికిత్స చేయడం సులవు అవుతుంది అన్నారు. అనారోగ్యం బారిన పడ్డప్పుడు ఈ కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళ్తే.. గతంలో ఎలాంటి వైద్యం చేయించారు.. ఇప్పుడు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులకు తెలుస్తుందని చెప్పుకొచ్చారు.

ప్రజలందరికి విద్య, వైద్యం అందుబాటులో ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెడికల్‌ టూరిజం హబ్‌గా తెలంగాణను అభివృద్ధి చేస్తామని.. కొత్త ఫార్మా గ్రామాలను ఏర్పాటు చేస్తామని.. శివారు శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రేవంత్‌ నిర్ణయంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.