ఏ బుద్ధిలేని వాడు చెప్పాడు నేను చంద్రబాబు శిష్యుడినని : CM రేవంత్ రెడ్డి

Revanth Reddy, Chandrababu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తరచూ చంద్రబాబు శిష్యుడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారిపై తాజాగా రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

Revanth Reddy, Chandrababu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తరచూ చంద్రబాబు శిష్యుడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారిపై తాజాగా రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయ ప్రస్థానం చూసినట్లు అయితే ఎన్నో కీలక ఘట్టలు మనకు కనిపిస్తాయి. ఆయన సీఎం కావడమే ఓ సంచలన అయితే.. ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా అంతకు మించి సంచలనమే. కాంగ్రెస్ లో తన బంధువులు ఉన్నప్పటికీ.. స్వతంత్ర అభ్యర్థిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత టీడీపీలో తన ప్రస్థానం కొనసాంచి.. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం అయ్యారు. అయితే ఆయనను తరచూ చంద్రబాబు శిష్యుడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారిపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.  ఏ బుద్ది లేని వాడు చెప్పాడు.. నేను చంద్రబాబు శిష్యుడనని అంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తీవ్ర స్థాయిలో ఉంది. వాతావరణం చల్లబడుతున్నా..పొలిటిక్ హీట్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే సమయంలో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా  ప్రధాన పార్టీలు కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎక్కువ స్థానాలు గెలిపించి..సోనియాకు గిఫ్ట్ ఇవ్వాలనే భావనలో ఉన్నారు. అందుకే విసృత్తంగా ప్రచారం చేస్తు ఉన్నారు. ఇదే సమయంలో  చంద్రబాబు శిష్యుడు అంటూ వస్తున్న కామెంట్స్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాజకీయాల్లో అనేక వార్తలు ప్రచారంలో ఉంటాయి. వాటిని నిజం అనేలా కొన్ని కొన్ని సంఘనలు చోటుచేసుకుంటాయి. అలాంటి ఘటనలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  జరిగింది.  రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడని తెగ ప్రచారం జరిగింది. అందుకే గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. రేవంత్ రెడ్డిని గెలిపించడం కోసమే.. ఆయన గురువు చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేశాయి. ఆ మాటలు నిజం చేస్తూనే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో టీడీపీ జెండాలు కనిపించాయి. మొత్తంగా కాంగ్రెస్ కి టీడీపీ మద్దతు తెలియజేసిందని చాలా మంది అభిప్రాయ పడ్డారు. అలానే కాంగ్రెస్ గెలిచిన తరువాత  చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని పలువురు కామెంట్స్ చేశారు.

తాజాగా  ఓ ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓ న్యూస్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సూపర్ సమాధానం ఇచ్చారు. శిష్యుడి కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీని పోటీ పెట్టకుండా విరమింప చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడి కోసం శిష్యుడు సహయం చేస్తారా? అని  ఓ జర్నలిస్ట్ రేవంత్ రెడ్డిని అడిగారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..”ఎవరయ్యా  బుర్రలేనోడు మాట్లాడేది. గురువు ఎవరు, శిష్యుడు ఎవరు. నేను సహచరుడిని అని చెప్పాను. ఎవరైన బుద్దిలేని  గాడిద కొడుకు గురువు, శిష్యులు అని మాట్లాడితే.. బుడ్డి మీద పెట్టి తంతా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు, నేను టీడీపీలో ఆయన సహచరుడిగా ఉన్నాను. ఇండిపెండెంట్  ఎమ్మెల్సీగా గెలిచి.. ఆ పార్టీ వెళ్లాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments