iDreamPost
android-app
ios-app

భోజన ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’

  • Author Soma Sekhar Published - 03:32 PM, Tue - 25 July 23
  • Author Soma Sekhar Published - 03:32 PM, Tue - 25 July 23
భోజన ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’

దక్షిణ మధ్య రైల్వే అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలోనే మెుట్టమెుదటి సారిగా ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ సేవలను ప్రారంభించారు. రాష్ట్రంలో రైల్వే కోచ్ లలో ఏర్పాటు చేసిన తొలి డైనింగ్, కెఫెటేరియా ఇదే కావడం విశేషం. ఈ సేవలను హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రారంభించారు. ఇక ఈ రెస్టారెంట్ ను భోజన ప్రియుల కోసం ప్రత్యేకమైన డైనింగ్, ఆకట్టుకునే ఇంటీరియర్స్ తో అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ రెస్టారెంట్ ఆన్ వీల్స్ కు సంబంధించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటోంది. తాజాగా మరో వినూత్న నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. తెలంగాణలోనే తొలిసారిగా ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ ను ప్రారంభించింది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో ఈ రెస్టారెంట్ ఆన్ వీల్స్ ను ప్రారంభించింది. ఈ రెస్టారెంట్ 24 గంటలు తెరిచే ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు నాణ్యమైన, వినూత్నమైన ఆహారాన్ని అందించేందుకు ఈ రెస్టారెంట్ ను ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. రెండు హెరిటేజ్ కోచ్ లను ఆకట్టుకునే ఇంటీరియర్స్ తో అద్భుతంగా డిజైన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ రెస్టారెంట్ ను సికింద్రాబాద్ కు చెందిన హావ్ మోర్ కోసం ఐదు సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారు. ఇక ఈ రెస్టారెంట్ లో నార్త్ ఇండియన్, చైనీస్, సౌత్ ఇండియన్, మెుఘలాయ్ వంటి వివిధ వంటకాలను అందించనుంది. కాగా.. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రతిరోజూ వేలాది ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. హైదరాబాద్ లోని భోజన ప్రియులకు ఇది మంచి అనుభూతిని ఇస్తుందని, దీనిని అందరు ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

ఇదికూడా చదవండి: 80 లక్షల మంది ఖాతాలో డబ్బలు జమ.. మీ అకౌంట్‌ చెక్‌ చేసుకొండి!