ఆ కుటుంబాలకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త.. వారందరికి క్షమాభిక్ష

TS Govt-Republic Day 2024: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆవివరాలు..

TS Govt-Republic Day 2024: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆవివరాలు..

గణతంత్ర దినోత్సవ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నేరాల్లో జైలు పాలై ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ.. అనారోగ్యం, వయోభారం, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారి శిక్షాకాలాన్ని తగ్గించి, క్షమాభిక్ష ప్రసాదించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఆ దిశగా చర్యలు చేపట్టింది. వేర్వేరు నేరాల్లో.. శిక్ష పడి.. ఏళ్లుగా జైల్లో ఉంటూ.. సత్ప్రవర్తన కలిగిన కొంతమంది ఖైదీలను విడుదల చేసేందుకు సర్కార్‌ సిద్ధమైంది. ఈ క్రమంలో జైల్లో ఉంటూ సత్ప్రవర్తన కలిగిన మెుత్తం 231 మంది ఖైదీల విడుదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల సదరు ఖైదీల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక క్షమాభిక్ష ప్రసాదించిన 231 మందిలో జీవితకాల ఖైదీలు 212 మంది ఉండగా.. జీవితేతర ఖైదీలు 19 మంది ఉన్నారు. త్వరలోనే ప్రభుత్వం వారిని విడదల చేయనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు విడతల్లో 400 మంది ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసింది.

ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రేవంత్‌ ప్రభుత్వం కూడా ఖైదీల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై జైళ్లశాఖ, పోలీసు ఉన్నతాధికారులు ఇది వరకే భేటీ అయ్యి దీనిపై చర్చించారు. మెుత్తం 231 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖైదీల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతోంది. అంతేకాక ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం ఆరు గ్యారెంటీల పథకానికి సంబంధించిన మార్గదర్శాలు రూపిందించడం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పనుల్లో ఉన్నారు అధికారులు.

ఇప్పటికే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. పెట్టుబడి సాయం నిధులు విడుదల చేస్తోంది. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచింది. త్వరలోనే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కల్పిస్తామని గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై చెప్పుకొచ్చారు. వంద రోజుల్లోగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.

Show comments