P Venkatesh
Reasons For Congress Lead in Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అదరగొట్టింది. 65 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినా హైదారాబాద్ లో డీలా పడడానికి గల కారణం ఏంటంటే?
Reasons For Congress Lead in Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అదరగొట్టింది. 65 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినా హైదారాబాద్ లో డీలా పడడానికి గల కారణం ఏంటంటే?
P Venkatesh
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ 65 సీట్లను గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి అధికారం చేపట్టాలన్న బీఆర్ఎస్ ఆశలు అడియాశలు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచారు. అంతే కాకుండా టీపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కృషి కూడా మరో కారణం. అయితే తెలంగాణ అంతటా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినా.. హైదరాబాద్ లో మాత్రం ఆధరణ కరువైంది. హస్తం పార్టీ రాష్ట్ర రాజధానిలో డీలా పడింది. దీనికి గల కారణం ఏంటంటే?
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని సొంత పార్టీ లీడర్లే విమర్శిస్తూ.. పార్టీని వీడి వెళ్తుంటే.. ఏ మాత్రం అదరక, బెదరక ముందుండి పార్టీని నడిపించారు రేవంత్ రెడ్డి. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికే లేదు.. ఆ పార్టీ వెంటిలేటర్ పై ఉంది అని ఎద్దేవ చేసిన ప్రతిపక్షలీడర్లకు దిమ్మతిరిగేలా సమాధానం ఇస్తూ నేడు పార్టీని విజయతీరాలకు చేర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కారణమయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలో అనుకున్న స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది కాంగ్రెస్. ఓ వైపు బీజేపీకి కూడా ఆధరణ పెరగడం బీఆర్ఎస్ పై వ్యతిరేకత రావడంతో భారీగా ఓట్లు చీలిపోయాయి. ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడింది. దీంతో హస్తం పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకోలేకపోయింది.
అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో చేసిన అభివృద్థి కూడా కాంగ్రెస్ హవాకు అడ్డుకట్ట వేసింది. సమర్ధవంతమైన, సుస్థిరమైన ప్రభుత్వం లేకపోతే నష్టపోతామని తెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇంకా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, ఇక్కడి ప్రజలు నమ్మడంతో కాంగ్రెస్ కు సీట్లు రాకుండా చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనపడడంతో మరోసారి ఆ పార్టీకే మద్దతు పలికారు గ్రేటర్ వాసులు. కనుకనే బీఆర్ఎస్ జంట నగరాల్లో సీట్లను గెలుచుకోగలిగింది. నగర ప్రజలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ కు మరోసారి అండగా నిలిచారు. నిరంతర విద్యుత్, తాగునీరు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించిన బీఆర్ఎస్ ను ఓటర్లు ఆదరించారు. ఈ కారణాలతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో డీలా పడింది. మరి హైదరాబాద్ జంట నగరాల్లో కాంగ్రెస్ డీలా పడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.